📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూర విద్యా కేంద్రం ద్వారా పీజీ కోర్సుల  దరఖాస్తుల ఆహ్వానం

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూర విద్యా కేంద్రం ద్వారా పీజీ కోర్సుల  దరఖాస్తుల ఆహ్వానం

📰 Generate e-Paper Clip

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూర విద్యా కేంద్రం ద్వారా పీజీ కోర్సుల  దరఖాస్తుల ఆహ్వానం.



చిత్తూరు మే 11 ప్రజావాణి: డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సువర్ణావకాశం కల్పిస్తోంది. ఈ సందర్భంగా చిత్తూరు నందు ఎస్వి స్టడీ సెంటర్ కోఆర్డినేటర్, పీజీ నోటిఫికేషన్ విధానాన్ని తెలియజేస్తూ ఉన్నత చదువులు అభ్యసించాలని చూస్తున్న విద్యార్థులు, భవిష్యత్తులో రాణించాలని చూస్తున్న వారికోసం.. పై పదవులకు కొనసాగాలని చూస్తున్న ఉద్యోగస్తులు, పీజీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం ఉందని, తెలియజేశారు. 2026 – 27 అకాడమిక్ సంబంధించి ఆచార్య నాగార్జున యూనివర్సిటీకీ ప్రభుత్వం అప్పగించింది. నోటిఫికేషన్ ద్వారా కోర్సుల వివరాలు ఎంఎస్సీ బాటని, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, స్టాటిటిక్స్, కంప్యూటర్ సైన్స్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంకాం అకౌంటెన్సీ, బ్యాంకింగ్, ఎంఏ ఇంగ్లీష్,తెలుగు, హిందీ, సాంస్క్రిట్, ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ,హ్యూమన్,రిసోర్స్ మేనేజ్మెంట్, ఎమ్మెస్ డబ్ల్యూ, తదితర కోర్సులు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎస్ వి స్టడీ సెంటర్ కార్యాలయము చిత్తూరు నందు నిర్వహిస్తున్నామని తెలిపారు. పీజీ కోర్సులకు దరఖాస్తు చేసుకునేవారు మరిన్ని వివరాలకు స్టడీ సెంటర్ చిత్తూరు ఫోన్ నెంబర్ 9177696071ను సంప్రదించి అడ్మిషన్ పొందవచ్చని  తెలిపారు. దరఖాస్తుల సమయం కొద్ది రోజులు మాత్రమే కలదని ఈ సందర్భంగా తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.