📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSangareddyఅమీన్‌పూర్‌లో గీతాంజలి స్కూల్ నూతన శాఖ ప్రారంభం

అమీన్‌పూర్‌లో గీతాంజలి స్కూల్ నూతన శాఖ ప్రారంభం

📰 Generate e-Paper Clip

అమీన్‌పూర్‌లో గీతాంజలి స్కూల్ నూతన శాఖ ప్రారంభం

పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగ రెడ్డి

అమీన్‌పూర్, జూన్ 21 (ప్రజావాణి): సైబరాబాద్ మున్సిపల్ అమీన్‌పూర్ పరిధిలోని సాయిరామ్ ఎన్‌క్లేవ్ ఫేజ్-2లో గీతాంజలి పాఠశాల నూతన శాఖను ఆదివారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హాజరుకాగా, అమీన్‌పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగ రెడ్డి ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగ రెడ్డి కలిసి రిబ్బన్ కట్ చేసి పాఠశాలను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం పాఠశాల ఆవరణను పరిశీలించి, యాజమాన్యాన్ని అభినందించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ, అమీన్‌పూర్ ప్రాంతంలో అత్యాధునిక వసతులతో గీతాంజలి పాఠశాల నూతన శాఖను ప్రారంభించడం అభినందనీయమని అన్నారు. ఇప్పటికే ఇస్నాపూర్‌లో నాణ్యమైన విద్యాబోధనతో మంచి గుర్తింపు పొందిన సంస్థ, ఇప్పుడు అమీన్‌పూర్‌లో మరో శాఖను ప్రారంభించడం సంతోషకరమని పేర్కొన్నారు. విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించి, వారి భవిష్యత్తుకు బలమైన పునాదులు వేయాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో అమీన్‌పూర్ మున్సిపల్ మాజీ ఎంపీపీ దేవానంద్, మాజీ జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, మాజీ కౌన్సిలర్ కొల్లూరి గోపాల్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఐలాపూర్ నరసింగరావు, అమీన్‌పూర్ ఎంఈఓ సుధాకర్, పాఠశాల యాజమాన్యం, స్థానిక నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.