📄 ePaper
Epaper 2
Monday, September 14, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్వేసవి సెలవులలో ఉపాధ్యాయులపై ఒత్తిడి తగదు.-విద్యా ప్రణాళిక షెడ్యూల్ ను వాయిదా వేయండి.-యుటిఎఫ్

వేసవి సెలవులలో ఉపాధ్యాయులపై ఒత్తిడి తగదు.-విద్యా ప్రణాళిక షెడ్యూల్ ను వాయిదా వేయండి.-యుటిఎఫ్

📰 Generate e-Paper Clip

కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (మే12) కడప జిల్లా శాఖ విమర్శ.విద్యా ప్రణాళిక రూపకల్పన పేరుతో ఫెయిల్ అయిన పదవ తరగతి విద్యార్థులకు రెమిడీయల్ తరగతుల పేరుతో వేసవి సెలవులలో ఉపాధ్యాయులపై ఒత్తిడి చేయడం తగదని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.లక్ష్మీరాజా,జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మాదన విజయకుమార్,పాలెం మహేష్ బాబు లు విమర్శించారు.మంగళవారం సాయంత్రం కడపలోని యుటిఎఫ్ భవన్లో ఆ సంఘ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవి సెలవులు మొదలైనప్పటి నుండి రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయుల సెలవులను హరిస్తూ ఏదో ఒక రకంగా ఒత్తిడికి గురి చేస్తున్నారని ఆరోపించారు. ఒకవైపు 10వ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులకు క్లాసులు నిర్వహించాలని ఆదేశాలిచ్చారని, మరోవైపు వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠశాల, ఆవాస ప్రాంతం,క్లస్టర్,మండల స్థాయి విద్యా ప్రణాళికలను వెంటనే రూపొందించాలని షెడ్యూల్ జారీ చేశారన్నారు. మే 11వ తేదీ పాఠశాల స్థాయి ఆవాస ప్రాంత ప్రణాళికలు రూపొందించాలని,12వ తేదీ గ్రామసభలు నిర్వహించాలని,13వ తేది గ్రామపంచాయతీ పరిధిలో ప్రణాళికలు ఆమోదింప చేసుకోవాలని,14వ తేది క్లస్టర్ స్థాయిలో ప్రణాళికలు రూపొందించాలని 15 వ తేదీ మండల స్థాయిలో విద్యా ప్రణాళికలు రూపొందించాలని,16వ తేదీ మండల స్థాయిలో రూపొందించిన ప్రణాళికలో జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయంలో సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారని వారు పేర్కొన్నారు.విద్యాశాఖ వెకేషన్ డిపార్ట్మెంట్ అని, అయితే కొంతకాలంగా విద్యాశాఖ అధికారులు విద్యాశాఖను వెకేషన్ డిపార్ట్మెంట్ అనే విషయాన్ని మరిచినట్టు ఉన్నారని వారు విమర్శించారు.గత సంవత్సరం నవంబర్, డిసెంబర్ మాసంలోనే రూపొందించాల్సిన విద్యా ప్రణాళికలను,అప్పుడు పట్టించుకోకుండా ఇప్పుడు వేసవి సెలవులలో రూపొందించాలనడం పనిగట్టుకొని ఉపాధ్యాయులను వేధించడమేనని వారు ఆరోపించారు.వేసవి సెలవులలో ఉపాధ్యాయులు సొంత గ్రామాలకు వెళ్లడం,వైద్య చికిత్స నిమిత్తం ఆసుపత్రులకు వెళ్లడం, సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు పెట్టుకోవడం సహజమన్నారు అలాంటి సందర్భంలో అకస్మాత్తుగా విద్యా ప్రణాళికలను రూపొందించే షెడ్యూల్ ను విడుదల చేసి అమలు చేయాలనడం వల్ల ఉపాధ్యాయులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని పేర్కొన్నారు. విద్యాశాఖ జారీచేసిన ఈ షెడ్యూల్ ను తక్షణమే ఉపసంహరించుకొని జూన్ మాసంలో నిర్వహించే విధంగా షెడ్యూల్ రూపొందించాలని వారు కోరారు.విద్యాశాఖ అధికారులు ముందస్తు ప్రణాళికలు లేకుండా అప్పటికప్పుడు రూపొందించి ఉపాధ్యాయులపై ఒత్తిడి చేయడం వల్ల సత్ఫలితాలు రావనే విషయాన్ని గుర్తించాలన్నారు. ఉపాధ్యాయ సంఘాలతో నిర్వహిస్తున్న సమావేశాలలో ఇలాంటి ప్రణాళికలపై చర్చించి షెడ్యూల్ ను ప్రకటించి అమలు చేయడం వల్ల విద్యాశాఖలో మెరుగైన ఫలితాలను సాధించవచ్చని హితవు పలికారు ప్రభుత్వ పాఠశాలలలో అడ్మిషన్లు నిర్వహించే కార్యక్రమంలో ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తూ,అడ్మిషన్ల ప్రక్రియను చేపడుతున్నారని వారు తెలిపారు ఉపాధ్యాయులను ఏదో ఒక రకంగా ఒత్తిడికి గురి చేసే కార్యాచరణను విద్యాశాఖ అధికారులు విడనాడాలని వారు కోరారు. ఇలాంటి విధానాలకు స్వస్తి చెప్పకపోతే ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనకు సిద్ధమవుతామని, ప్రభుత్వం ప్రకటించిన విద్యా ప్రణాళిక షెడ్యూల్ ను బహిష్కరిస్తామని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా కార్యదర్శులు జి.గోపీనాథ్, జె.వి.సుబ్బారెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డి.క్రిష్ణారెడ్డి,జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్.మహబూబ్ బాషా,జి.వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.