📄 ePaper
Epaper 2
Monday, September 14, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణNalgondaబెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు -- మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు

బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు — మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు

📰 Generate e-Paper Clip

*బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు — మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు*

*చండూర్ ప్రతినిధి (ప్రజావాణి)*

చండూరు మున్సిపాలిటీ పరిధిలో నిర్వహిస్తున్న బెల్ట్ షాపులను తొలగించాలని డాక్టర్ కోడి శ్రీనివాసులు అన్నారు. మున్సిపాలిటీ పరిధిలో చాలామంది బెల్ట్ షాపులను నిర్వహిస్తున్నారని, బెల్ట్ షాపులు నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించడం వల్ల మున్సిపాలిటీలో రోడ్డు ప్రమాదాలు, గొడవలు, కొట్లాటలు జరిగి శాంతి భద్రతలకు వివాదం కలుగుతుందని అన్నారు. ఎక్సైజ్ అధికారులు, పోలీస్ శాఖ వారు బెల్ట్ షాపులపై నిఘా పెట్టాలని, నిర్వహించిన వారిపై కేసులు పెట్టి, జరిమానాలు విధించి, బైండోవర్లు చేయాలని అన్నారు. చండూర్ మున్సిపాలిటీ పరిధిలో చాలా వీధులలో బెల్ట్ షాపులు దర్శనమిస్తున్నాయని, ఉదయం 05:00 గంటల నుండి మద్యం సేవించి చాలామంది మద్యానికి బానిసలు అయ్యారని అన్నారు. మద్యానికి బానిస కాకుండా కుటుంబాలు మరియు సమాజం బాగుండాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిత్యం బెల్ట్ షాపుల నివారణకు పోరాటం చేస్తున్నారని గుర్తు చేశారు. వీరి వెంట మున్సిపల్ వైస్ చైర్మన్ భూతరాజు దశరథ, కౌన్సిలర్లు కోడి సుష్మా వెంకన్న, తేలుకుంట్ల రాజకుమారి శేఖర్, కలిమికొండ పారిజాత జనార్ధన్, జెల్ల ధనమ్మ శ్రీనివాసులు, బుషిపాక వాసు, కటకం రమేష్, కొండ్రెడ్డి మధు, సామ సుజాత యాదవ రెడ్డి, కోఆప్షన్ సభ్యులు కల్లెట్ల చంద్రకళ మారయ్య, ఖలీల్, సలీమా షరీఫ్, మొగదాల వెంకన్న ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.