📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్మార్కాపురం అడిషనల్ ఎస్పీ గా డాక్టర్ టి. డి యశ్వంత్ కు పదోన్నతి.

మార్కాపురం అడిషనల్ ఎస్పీ గా డాక్టర్ టి. డి యశ్వంత్ కు పదోన్నతి.

📰 Generate e-Paper Clip

మార్కాపురం. (మే21 ప్రజావాణి) డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డిఎస్పీ) గా పనిచేస్తున్న తంగిరాల దత్త యశ్వంత్ కు అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్పీ) గా పదోన్నతి లభించింది.ఈ మేరకు రాష్ట్ర హోమ్ శాఖ కార్యాలయం నుండి ఉత్తర్వులు వెలువడ్డాయి.ఈయన తొలుత చిత్తూరు జిల్లా పుత్తూరు సబ్ డివిజన్ డిఎస్పీ గాను, అనంతరం పుట్టపర్తి, తిరుపతి,జమ్మలమడుగు సబ్ డివిజన్ లలో డిఎస్పీ గా సమర్ధవంతంగా బాధ్యతలను నిర్వర్తించారు.అలాగే ఈయన పనిచేసిన అన్ని సబ్ డివిజన్ లు రాయలసీమ ప్రాంతాల్లోనే ఉండడం విశేషం.ఈయన చిత్తూరు జిల్లాలో పని చేసిన సమయంలో అక్రమంగా తరలిస్తున్న ఎర్ర చందనం స్మగ్లర్లను సమయ స్పూర్తితో పట్టుకోవడం జరిగింది.ఈ సందర్భంగా ఆయనకు రాష్ట్ర హోమ్ శాఖ ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు అందాయి.ఈయన పనిచేసిన అన్ని ఏరియాల్లో ప్రజల నుండి మంచి అధికారిగా పేరు తెచ్చుకున్నారు.అలాగే నిజాయితీ గల అధికారిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కార్యాలయంలో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.ఈయన సిఎం కార్యాలయంలో సమర్ధవంతంగా బాధ్యతలను నిర్వర్తిస్థుండడంతో పలు సందర్భాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుండి ప్రశంసలు సైతం పొందినట్లు తెలుస్తోంది.ఏఎస్పీ గా పదోన్నతి పొందిన డాక్టర్ యశ్వంత్ మార్కాపురం పట్టణానికి చెందిన జాతీయ ఉత్తమ అవార్డు గ్రహీత తంగిరాల నాగ జగన్నాథం,మండల విద్యా శాఖ అధికారిణి శార్వాణి దంపతుల కుమారుడు అనే విషయం అందరికి తెలిసిందే.ఏఎస్పీ గా పదోన్నతి పొందిన సందర్భంగా టి. దత్త యశ్వంత్ కు పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.