📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్మాధవరం హ్యాండ్లూమ్ క్లస్టర్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి

మాధవరం హ్యాండ్లూమ్ క్లస్టర్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి

📰 Generate e-Paper Clip

వైయస్సార్ కడప జిల్లా (మే02) కడప మాధవరం హ్యాండ్లూమ్ క్లస్టర్ అభివృద్ధికి తగిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు.శనివారం మాధవరంలోని హ్యాండ్లూమ్ క్లస్టర్ కామన్ ఫెసిలిటీ సెంటర్ (CFC)ను ఆకస్మికంగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పరిశీలించారు. ఈ సందర్భంగా క్లస్టర్‌లోని వీవర్స్ షెడ్, డై హౌస్ రూమ్‌లను ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, హ్యాండ్లూమ్ క్లస్టర్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రస్తుతం అందుబాటులో ఉన్న వసతులను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకువస్తామన్నారు. క్లస్టర్ అభివృద్ధికి అవసరమైన పనులకు సంబంధించి ప్రణాళికను సిద్ధం చేసి సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రధానంగా డై హౌస్ మరియు షెడ్ల ఆధునీకరణ ద్వారా చేనేత కార్మికులకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని ఆయన పేర్కొన్నారు. దీనికి సంబంధించి సమగ్రమైన యాక్షన్ ప్లాన్ రూపొందించి నివేదిక ఇవ్వాలని సంబంధిత శాఖ అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రాజ్యలక్ష్మి, హ్యాండ్లూమ్ అధికారులు , రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.