మాధవరం హ్యాండ్లూమ్ క్లస్టర్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి

వైయస్సార్ కడప జిల్లా (మే02) కడప మాధవరం హ్యాండ్లూమ్ క్లస్టర్ అభివృద్ధికి తగిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు.శనివారం మాధవరంలోని హ్యాండ్లూమ్ క్లస్టర్ కామన్ ఫెసిలిటీ సెంటర్ (CFC)ను ఆకస్మికంగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పరిశీలించారు. ఈ సందర్భంగా క్లస్టర్‌లోని వీవర్స్ షెడ్, డై హౌస్ రూమ్‌లను ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, హ్యాండ్లూమ్ క్లస్టర్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రస్తుతం అందుబాటులో ఉన్న వసతులను పూర్తిస్థాయిలో వినియోగంలోకి...