📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్పోరుమామిళ్ల మండలానికి రైతు బజార్ ఎక్కడ,,

పోరుమామిళ్ల మండలానికి రైతు బజార్ ఎక్కడ,,

📰 Generate e-Paper Clip

వైఎస్ఆర్ కడప జిల్లా,(మే19 ప్రజావాణి) పోరుమామిళ్ల మండల పరిధిలోని రైతులము మరియు స్థానిక ప్రజలము. పోరుమామిళ్ల చుట్టుపక్కల గ్రామాలకు పెద్ద వ్యాపార కేంద్రంగా ఉంది.ప్రస్తుతం మా మండలంలో శాశ్వత రైతు బజార్ లేకపోవడం వల్ల స్థానిక రైతులు తాము పండించిన కూరగాయలను,పంటలను అమ్ముకోవడానికి సరైన స్థలం లేక ఇబ్బంది పడుతున్నారు.రోడ్ల పక్కన అమ్మడం వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి.వినియోగదారులకు,రైతులకు అందుబాటులో ఉండే విధంగా ఒక ప్రభుత్వ స్థలాన్ని  రైతు బజార్ కొరకు కేటాయించాల్సిందిగా కోరుతున్నాము.ఇక్కడ రైతు బజార్ ఏర్పాటు చేస్తే,దళారీల ప్రమేయం లేకుండా రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుంది.ప్రజలకు తక్కువ ధరకే తాజా కూరగాయలు అందుతాయి.మండలంలో రైతు బజార్లో లేకపోవడంతో రహదారుల పక్కన ఆయా కోడల్లో కూరగాయల మార్కెట్లు నిర్వహిస్తున్నారు.కొన్నిచోట్ల మార్కెట్లు ఉన్న అనుకూలమైన చోట చోటు లేకపోవడంతో వినియోదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కనీసం సదుపాయాలు కల్పించిన దాఖలు లేవు రహదారికి ఇరువైపులా విక్రయించాల్సిన పరిస్థితి మండలానికి ఒక రైతు బజార్ ఏర్పాటు చేసి ఉత్పత్తిదారులకు గిట్టుబాటు కల్పించడంతో పాటు వినియోగదారులకు సరసమైన ధరలకు తాజా కూరగాయలు అందించాలని ప్రభుత్వం సంబంధించిన అధికారులకు ఆదేశించింది పోరుమామిళ్ల రెవెన్యూ మున్సిపాలిటీ మార్కెటింగ్ శాఖ అధికారుల స్పందించి,పోరుమామిళ్లలో రైతు బజార్ ఏర్పాటుకు అనువైన ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించి,త్వరగతిన కేటాయించాల్సిందిగా వినమ్రంగా ప్రార్థిస్తున్నాము.ఇట్లు,పోరుమామిళ్ల మండల రైతులు మరియు ప్రజలు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.