📄 ePaper
Epaper 2
Monday, September 14, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్పోరుమామిళ్ల పోలీస్ శాఖలో ఏం జరుగుతోంది? న్యాయం చచ్చిందా.. 'పంచాయతీ'లు రాజ్యమేలుతున్నాయా?

పోరుమామిళ్ల పోలీస్ శాఖలో ఏం జరుగుతోంది? న్యాయం చచ్చిందా.. ‘పంచాయతీ’లు రాజ్యమేలుతున్నాయా?

📰 Generate e-Paper Clip

కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (మే08) పోరుమామిళ్ల డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్లు ఇప్పుడు చట్టాన్ని కాపాడాల్సిన చేతులే.అక్రమాలకు అండగా నిలుస్తున్నాయా బాధితులకు అండగా ఉండాల్సిన ఖాకీలు.పైరవీకారులకు వంత పాడుతున్నారా ప్రస్తుతం పోరుమామిళ్ల పోలీస్ డివిజన్ పరిధిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే సామాన్య ప్రజల్లో ఇదే అనుమానం వ్యక్తమవుతోంది.1.స్టేషన్లలో ‘సెటిల్మెంట్ల’ రాజ్యం?పోరుమామిళ్ల డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్లు ఇప్పుడు బాధితులకు న్యాయం చేసే కేంద్రాలుగా కంటే,వివాదాలను పరిష్కరించే ‘పంచాయతీ కేంద్రాలు’గా మారాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.కొందరు అవినీతి అధికారులు,కొంతమంది స్వార్థపూరిత జర్నలిస్టులతో చేతులు కలిపి.. స్టేషన్లోనే సెటిల్మెంట్లు చేస్తూ సామాన్యుల నడ్డి విరుస్తున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 2.ట్రాఫిక్ అస్తవ్యస్తం.కానిస్టేబుళ్ల ప్రతాపం!పోరుమామిళ్ల టౌన్ లో ట్రాఫిక్ నియంత్రణ అన్నది గాలికొదిలేసినట్టు కనిపిస్తోంది.రోడ్లపై వాహనాల రద్దీతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే, క్షేత్రస్థాయిలో ఉన్న కానిస్టేబుళ్లు,హోంగార్డులు ట్రాఫిక్ ను సరిదిద్దడం మాని,సామాన్య వాహనదారులపై తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.అమాయక ప్రజలపై జులుం ప్రదర్శిస్తున్న వీరికి ఉన్నతాధికారుల అండదండలు ఉన్నాయా లేక అధికారులే చోద్యం చూస్తున్నారా?3.రాజకీయ అడుగులకు మడుగులు.పోలీస్ వ్యవస్థ స్వతంత్రంగా పనిచేయడం మానేసి,రాజకీయ నాయకుల కనుసన్నల్లో మెలుగుతోందనేది జగమెరిగిన సత్యంగా మారింది. నిజాయితీగా బాధితుడు స్టేషన్‌కు వస్తే.. అతనికి న్యాయం జరగడం పక్కన పెడితే,ఎదుటివారు ఏ పార్టీ ఏ పలుకుబడి అని లెక్కలు చూస్తున్నారనే వాదన బలంగా ఉంది.బాధితుడి కన్నీరు తుడవాల్సింది పోయి.బాధితుడినే భయపెట్టే సంస్కృతి పోరుమామిళ్ల డివిజన్ స్టేషన్ల పరిధిలో నడుస్తోందనేది ప్రజల్లో బలంగా వినిపిస్తున్న ఆరోపణలు అధికారులు మారవచ్చు కానీ,అవినీతి అడ్డాగా మారిన తీరు మాత్రం మారడం లేదు.”త్వరలో.సంచలన రిపోర్ట్! పోరుమామిళ్ల పోలీసు వ్యవస్థలో జరుగుతున్న అక్రమాలు,తేదీల వారీగా.ఆధారాలతో సహా.ఎక్స్ క్లూజివ్ నిశిత విశ్లేషణ త్వరలో ప్రజావాణి న్యూస్ లో ప్రసారం కానుంది.ఎవరు ఎంత వసూలు చేశారు ఏ కేసులో ఎవరికి అన్యాయం జరిగింది?రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు ఎవరు డేట్ టు డేట్.టైం టు టైం.పూర్తి రిపోర్ట్ సిద్ధం.పోలీసులారా.మీ అక్రమాలకు తెర పడే సమయం ఆసన్నమైంది

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.