📄 ePaper
Epaper 2
Monday, September 14, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్పని ప్రదేశాలలో లైంగిక వేధింపుల చట్టంపై అవగాహనా కలిగివుండలి- జిల్లా కో ఆర్డినేటర్ చైతన్య 

పని ప్రదేశాలలో లైంగిక వేధింపుల చట్టంపై అవగాహనా కలిగివుండలి- జిల్లా కో ఆర్డినేటర్ చైతన్య 

📰 Generate e-Paper Clip

ప్రజావాణి మే 08మోతె మండలకేంద్రంలోని మామిళ్ళగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఉపాధి హామీ కూలీలలకు మహిళా శిశు సంక్షేమ శాఖలోని మహిళా సాధికారత కేంద్రం వారి ఆధ్వర్యంలో అవగాహనా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం లో భాగంగా జిల్లా కో ఆర్డినేటర్ చైతన్య మాట్లాడుతూ మహిళా శిశు సంక్షేమ శాఖ అందిస్తున్న సేవలను వివరించడం జరిగింది. అదేవిధంగా మహిళా చట్టలపై అవగాహనా అవసరం అని పని ప్రదేశాలలో లైంగిక వేధింపుల చట్టం పై అవగాహన కల్పించారు. బాల్య వివాహాలు చేసినట్లయితే పోక్సో చట్టం ద్వారా కేసు నమోదు చేస్తారని గ్రామంలో బాల్య వివాహాలు జరగకుండా చూడాల్సిన భాద్యత అందరిపై ఉందని తెలియచేసారు. మహిళలు ఆర్థికంగా ఎదిగినపుడే దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటుంది అన్నారు. మహిళలు అన్ని రంగాలలో రానించాలని అన్నారు. మరియు గర్భస్థ లింగ నిర్దారణ చేసి ఆడపిల్లలను చంపడం నేరమని అలాంటి చర్యలకు పాల్పడిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయి అన్నారు అక్రమ దత్తతలు కూడా ప్రోత్సహించవద్దు అని దత్తత కావలసిన వారు ప్రభుత్వం ద్వారా కారా వెబ్సైటు లో కానీ బాల రక్షణ సమితి వారి ఆధ్వర్యంలో తీసుకోవాలని సూచించారు అదేవిదంగా మహిళలకు గృహహింస మరియు వేధింపులకు గురి ఐతే సఖి కేంద్రాన్ని వెళ్ళవచ్చు అని అక్కడ ఐదు సర్వీసులతో మహిళలకు సహాయం అందిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమం లో మహిళా సాధికారత కేంద్రం జెండర్ స్పెషలిస్ట్ వినోద్, ఫీల్డ్ అసిస్టెంట్ లింగయ్య తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.