📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్పాడుతా తీయగా వేదికపై మెరిసుతున్న ఎదులాబాద్ చిన్నారి అన్విత

పాడుతా తీయగా వేదికపై మెరిసుతున్న ఎదులాబాద్ చిన్నారి అన్విత

📰 Generate e-Paper Clip

“పాడుతా తీయగా” వేదికపై మెరిసుతున్న ఎదులాబాద్ చిన్నారి అన్వి

ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని ఎదులాబాద్ గ్రామానికి చెందిన చిన్నారి పోరెత్తి అన్విత ప్రముఖ సంగీత కార్యక్రమం “పాడుతా తీయగా” వేదికపై తన మధురమైన గానంతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటూ గ్రామానికి గర్వకారణంగా నిలుస్తోంది. పల్లె గుండెలో పుట్టిన ప్రతిభకు సరైన వేదిక దొరికితే ప్రపంచాన్ని మెప్పించగలదని అన్విత తన ప్రతిభతో నిరూపిస్తోంది.

తల్లిదండ్రులు పోరెత్తి స్రవంతి, ఫణి కుమారాచార్యుల ప్రోత్సాహంతో చిన్న వయసులోనే సంగీతాన్ని జీవిత భాగంగా చేసుకున్న అన్విత, ప్రతి ఎపిసోడ్‌లో అద్భుతమైన గాన ప్రదర్శనతో న్యాయనిర్ణేతల ప్రశంసలు అందుకుంటోంది. ఆమె స్వరంలోని మాధుర్యం, పాటల పట్ల అంకితభావం, వేదికపై చూపిస్తున్న ఆత్మవిశ్వాసం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

చిన్న వయసులోనే కఠిన సాధనతో ముందుకు సాగుతూ అన్విత సంపాదిస్తున్న గుర్తింపు భవిష్యత్తులో తెలుగు సంగీత ప్రపంచంలో ఆమెకు ప్రత్యేక స్థానం తీసుకురానుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గ్రామీణ ప్రాంతానికి చెందిన ఓ చిన్నారి జాతీయ స్థాయి వేదికపై రాణించడం ఎదులాబాద్ గ్రామానికే గర్వకారణంగా మారింది.

అన్విత సాధిస్తున్న విజయాలు గ్రామంలోని మరెందరో చిన్నారులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. ఇలాంటి ప్రతిభలను గుర్తించి ప్రోత్సహించడం తల్లిదండ్రులు, గురువులు, సమాజం అందరి బాధ్యత అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

సంగీత ప్రపంచంలో మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తూ తెలుగు రాష్ట్రాలకు గర్వకారణంగా నిలవాలని చిన్నారి అన్వితకు ప్రజలు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.