📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణKhammamపందిళ్ళపల్లి వ్యవహారంలో రిపోర్టు సమర్పించారటకానీచాలా తప్పులు ఉన్నాయట రిమార్క్స్సెలవులో మండల పంచాయతీ అధికారిణి

పందిళ్ళపల్లి వ్యవహారంలో రిపోర్టు సమర్పించారట

కానీచాలా తప్పులు ఉన్నాయట రిమార్క్స్

సెలవులో మండల పంచాయతీ అధికారిణి

📰 Generate e-Paper Clip

పందిళ్ళపల్లి వ్యవహారంలో రిపోర్టు సమర్పించారట..?

కానీ… చాలా తప్పులు ఉన్నాయట (రిమార్క్స్)..!

*సెలవులో మండల పంచాయతీ అధికారిణి…?

*నివేదిక మార్పులు చేర్పులు చేసిన తర్వాత మళ్లీ ఎన్నాళ్లకు చర్యలు ఉంటాయో…?

ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి



ఖమ్మం జిల్లా చింతకాని మండలం పందిళ్ళపల్లి ఓ ప్లాట్ వ్యవహారంలో గత సంవత్సరం సెప్టెంబర్ 24న ఖమ్మం జిల్లా కలెక్టర్కు నేలకొండపల్లి మండలం చెరువు మాధవరం గ్రామానికి చెందిన బాధితులు ప్రజావాణి గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు. ఆ మేరకు నాటి కలెక్టర్ డిపిఓ లు అందిన దరఖాస్తు మేరకు విచారణ కోరే సమయంలో మన ప్రజావాణి తెలుగు దినపత్రిక సమగ్ర ఆధారాలతో సంచలన కథనాలు అందించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు నాటి కలెక్టర్ ఆదేశాలతో సుమోటోగా స్వీకరించిన దరఖాస్తును ఈ ఏడాది జనవరి ఫిబ్రవరి నెలలో జిల్లా పంచాయతీ అధికారి రాంబాబు రెండు దశల్లో విచారణ చేశారు. విచారణ అనంతరం పందిళ్ళపల్లి పంచాయతీ రికార్డులలో నిర్లక్ష్యం తో పాటు అనేక అవకతవకలు ప్రభుత్వ నిబంధనల ఉల్లంఘన లాంటి అంశాలను ధ్రువీకరించారు. ఆ మేరకు ప్రస్తుతం మధిర మండలం మాటూరు పంచాయతీ కార్యదర్శి బండి నాగేంద్రబాబు పందిళ్ళపల్లి గ్రామపంచాయతీ అధికారులను తారుమారు చేసి నిర్లక్ష్యంగా వ్యవహరించారని తేల్చారు. కానీ అనేక నాటకీయ పరిణామాల నేపథ్యంలో గత ఐదు నెలల క్రితం ప్రజావాణిలో అందించిన దరఖాస్తు నేటికీ పరిష్కారం కాకపోవటంతో మండల ప్రజలు బాధితులు హక్కుల సంఘాల నేతలు తీవ్ర అసహనం ఆగ్రహం చేస్తున్న నేపథ్యం. ఈ నేపథ్యంలో మన ప్రజావాణి అనేక ప్రత్యేక కథనాలు అందిస్తూ ఖమ్మం రూరల్ సబ్ రిజిస్టర్ నిబంధనలకు విరుద్ధంగా తప్పులు డాక్యుమెంట్లను పొందుపరిచి ఉన్నప్పటికీ పెద్దగా పట్టించుకోకుండా అక్రమ రిజిస్ట్రేషన్ చేసి ఓ ప్రైవేటు ఫైనాన్స్ సంస్థ నుండి 360000 రుణం పొందేందుకు సహకరించారని బాధితులు మండల ప్రజలు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పనిచేస్తున్న ఓ ఎంపీ ఓ 2017 సంవత్సరంలో రికార్డులను పరిశీలించకుండా కాసులకు కక్కుర్తిపడి అడ్డగోలుగా ఆన్లైన్ వ్యవహారం పూర్తి చేసినట్లు ఆ రికార్డులను సరిగా పరిశీలించకుండా నేటి పంచాయతీ కార్యదర్శి అక్రమ రిజిస్ట్రేషన్ హక్కులు పొందేందుకు తన వంతు సహాయం చేసినట్లు ప్రభుత్వ రికార్డులు స్పష్టం చేస్తున్నాయని పలువురు మండల ప్రజలు స్థానికులు బాధితులు ఆరోపిస్తున్నారు. ఐదు నెలలు రెండు షో కా జ్ నోటీసులు  ఎంక్వయిరీలు ముగిసి ఇటీవల గత 40 రోజుల క్రితం స్థానిక చింతకాని ఎంపీ ఓ కు ఐదు రోజుల గడువు తో నివేదిక కోరుతూ ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఐదు రోజులు గడువు ముగిసి పోయిన సంబంధిత జిల్లా పంచాయతీ అధికారులు సదరు మండల పంచాయతీ అధికారిపై చర్యలు తీసుకోకపోగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది.గత మూడు రోజుల క్రితం రాష్ట్ర రెవిన్యూ గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖమంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నేలకొండపల్లి మండలం గువ్వల గూడెంలో జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో చెరువు మాదారం గ్రామానికి చెందిన బాధితులు తమ గో డును వెళ్లబుచ్చుకున్నారు. దీంతో స్పందించిన మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి వేదికపై ఉన్న జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ ను ఆదేశిస్తూ ప్రజావాణి గ్రీవెన్స్ దరఖాస్తు ప్రకారం చేసిన ఎంక్వయిరీ లు నివేదిక ప్రకారం తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు స్పందించిన జిల్లా పంచాయతీ అధికారి సదరు మండల పంచాయతీ అధికారిని సంప్రదించినట్లు తెలిసింది. గత మూడు రోజుల క్రితం సదరు మండల పంచాయతీ అధికారిని నివేదిక అందజేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలోని ఏవో రాజేశ్వర్ మన ప్రజావాణి ఖమ్మం బ్యూరో ప్రతినిధికి తెలిపారు. అందించిన నివేదికలో తప్పుడు తడకలు ఉండటంతో నివేదికను తిరిగి పంపించినట్లు అంగీకరించారు. కాగా సదరు మండల పంచాయతీ అధికారిని నివేదిక అందించిన మరుక్షణం సెలవులో వెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం మేరకు తెలిసింది. గత సంవత్సరం క్రితం నుండి విధులు నిర్వహిస్తున్న సదరు మండల పంచాయతీ అధికారిని పంచాయతీ కార్యదర్శులతో సమన్వయం లేకుండా వ్యవహరిస్తున్నట్లు చెప్పిందే విధంగా చేయాల్సిందే అంటూ ఆదేశాలు ఇస్తున్నట్లు ఏదైనా అవసరం ఉండి ప్రజాప్రతినిధులు కానీ పంచాయతీ కార్యదర్శులు కానీ సదరు ఎంపీఓను సంప్రదిస్తే స్పందించరనే పేరు సంపాదించుకున్నట్లు తెలిసింది. సదరు పంచాయతీ అధికారిపై పలువురు ప్రజాప్రతినిధులు తోపాటు మాజీ ప్రజాప్రతినిధులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి అందిన నివేదికలు పందిళ్ళపల్లి పంచాయతీ రికార్డులను పరిగణలోకి తీసుకొని అక్రమ రిజిస్ట్రేషన్ కు సహకరించిన రికార్డులను తారుమరు చేసిన పంచాయతీ కార్యదర్శులపై మరియు అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేస్తూ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఎంపీఓపై కూడా చర్యలు తీసుకోవాలని పలువురు మండల ప్రజలు స్థానికులు ప్రజాసంఘాల నేతలు ముక్తకంఠంతో కోరుతున్నారు.

కాగా ఈ వ్యవహారంలో కొందరు దళారులు బ్రోకర్లు ఏజెంట్లు రాజకీయ ముసుగులో గత ప్రభుత్వ హయాంలో పంచాయతీ కార్యదర్శులపై ఒత్తిడి తీసుకొచ్చి రికార్డులను తారుమారు చేసి పబ్బం గడుపుకున్నట్లు తెలిసింది. గత ఆరు నెలల క్రితం కొన్ని ప్రైవేటు పంచాయతీలు కూడా నిర్వహించి రాజీ యత్నాలు చేసినట్లు బాధితులు మండల ప్రజలు స్థానికులు ఆరోపిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.