📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణRangareddyనగర్ లో టిడిపి  "మహానాడు

నగర్ లో టిడిపి  “మహానాడు

📰 Generate e-Paper Clip

*షాద్ నగర్ లో టిడిపి  “మహానాడు”*

*మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గం నుండి నాయకులు, కార్యకర్తల రాక*
షాద్ నగర్ ప్రజావాణి మే 27 :
తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో వర్చువల్‌గా నాయకులు కార్యకర్తలు  తిలకించారు.
మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలోని షాద్ నగర్ పట్టణంలో గల మా కన్వెన్షన్ హాల్లో ఏర్పాటుచేసిన వర్చువల్ కార్యక్రమానికి పార్లమెంటు పరిధిలోని షాద్ నగర్, కొడంగల్, పాలమూరు, నారాయణపేట, దేవరకద్ర, జడ్చర్ల, మక్తల్, పాలమూరు రూరల్ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా తమ అధినేత నారా చంద్రబాబు నాయుడు అదే విధంగా తెలంగాణ మేత పోలిట్ బ్యూరో సభ్యుడు బక్కని నర్సింహులు తదితర నేతల ప్రసంగాలను వర్చువల్ గా విన్నారు. ఈ సందర్భంగా మాజీ సీఎం నందమూరి తారక రామారావుకు నివాళులు అర్పించారు. ఈసారి మహానాడును పూర్తిగా సాంకేతికత ఆధారంగా వర్చువల్ విధానంలో నిర్వహిస్తున్నారనీ  స్థానిక నాయకులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 1875 క్లస్టర్లలో 1851 క్లస్టర్లను పార్టీ కేంద్ర కార్యాలయంతో అనుసంధానం చేశారు. ప్రతి నియోజకవర్గం నుంచి ఒక క్లస్టర్‌ను Two-Way కమ్యూనికేషన్ సిస్టమ్ ద్వారా నేరుగా అనుసంధానిస్తూ నాయకులు, కార్యకర్తలతో మమేకం కానున్నారు. కార్యక్రమాన్ని వీక్షించేందుకు ప్రతి క్లస్టర్‌లో భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు.
అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న మహానాడుకు రికార్డు స్థాయిలో స్పందన లభించిందనీ నాయకులు తెలిపారు. హైబ్రిడ్ మోడ్‌లో నిర్వహించిన ఈ మహానాడులో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న క్లస్టర్లతో పాటు తెలంగాణ, అండమాన్, ఇతర దేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు వర్చువల్‌గా పాల్గొన్నారు. ఆ ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు చల్లా వెంకటేశ్వర రెడ్డి, కుమార్ గౌడ్, గంధం ఆనంద్, వెంకటయ్య గౌడ్, అనుమారీ వెంకటయ్య, కొడంగల్ నేతలు అచ్యుతారెడ్డి, శేఖర్, అమృతా రెడ్డి, పాలమూరు నుండి బాలప్ప, శేఖర్ రెడ్డి, సాయన్న గౌడ్, వెంకటయ్య సాగర్ నారాయణపేట నుండి రాములు యాదవ్, మొగులప్ప, ఓం ప్రకాష్, దేవరకద్ర నుండి జనార్దన్ నాయుడు కిషన్ నాయక్ యాదిరెడ్డి నరేష్ జడ్చర్ల నియోజకవర్గం నుండి వెంకటేశ్వర్లు రాజేష్ కుమార్ బోయ శీను పాలమూరు రూరల్ నుండి నాగలింగం రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.