📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణNalgondaచైన్ స్నాచింగ్ కేసును ఛేదించిన సి సి ఎస్ పోలీస్ & తిప్పర్తి పోలీస్ –...

చైన్ స్నాచింగ్ కేసును ఛేదించిన సి సి ఎస్ పోలీస్ & తిప్పర్తి పోలీస్ – ఇద్దరు నిందితుల అరెస్ట్ వీరిలో ఒకరు మైనర్ – నల్లగొండ డిఎస్పి శివరాం రెడ్డి

📰 Generate e-Paper Clip

*చైన్ స్నాచింగ్ కేసును ఛేదించిన సి సి ఎస్ పోలీస్ & తిప్పర్తి పోలీస్ – ఇద్దరు నిందితుల అరెస్ట్ వీరిలో ఒకరు మైనర్ – నల్లగొండ డిఎస్పి శివరాం రెడ్డి*

*నల్గొండ జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)*

తేది 11-05-2026 మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో తిప్పర్తి మండలం ఎర్రగడ్డ గూడెం గ్రామ కేంద్రంలోని మర్రిచెట్టు కింద కూర్చున్న చింతమల్ల సత్యమ్మ (70) అనే వృద్ధురాలి మెడలో ఉన్న బంగారు గొలుసును ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు షైన్ మోటార్‌సైకిల్‌పై వచ్చి తెంపుకొని పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు తిప్పర్తి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు, నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి నేతృత్వంలో, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ జితేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక బృందం, తిప్పర్తి ఎస్సై వి శంకర్ ఆధ్వర్యంలో మరో బృందం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడింది. పోలీసులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి దర్యాప్తు చేపట్టగా, శనివారం (16-05-2026) ఉదయం నమ్మదగిన సమాచారం మేరకు నకిరేకల్ నుంచి తిప్పర్తి వెళ్లే రోడ్డుపై సీసీస్ పోలీస్ మరియు తిప్పర్తి పోలీస్ లు సంయుక్తంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా షైన్ బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించగా, పోలీసులు వెంటాడి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి చోరీకి గురైన సుమారు 30 గ్రాముల బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు. నిందితుల వివరాలు 1) బాణాల హరిచంద్ర ప్రసాద్, తండ్రి కోటయ్య, వయస్సు 18 సంవత్సరాలు, వృత్తి ట్రాక్టర్ డ్రైవర్, చీమలగడ్డ గ్రామం, నకిరేకల్ మండలం. 2) మైనర్ బాలుడు. ఈ సందర్బంగా డిఎస్పీ మాట్లాడుతూ వేసవికాలంలో గ్రామాల్లో నేరస్తుల సంచారం పెరిగే అవకాశమున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండి తమ ఆస్తులను రక్షించుకోవాలని డిఎస్పీ సూచించారు. అలాగే గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే ఇలాంటి నేరాలను త్వరితగతిన ఛేదించేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. కేసును ఛేదించిన జితేందర్ రెడ్డి సీసీఎస్ ఇన్‌స్పెక్టర్, వి శంకర్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్, తిప్పర్తి, హెడ్ కానిస్టేబుల్స్ విష్ణువర్ధన్ గిరి, నాగార్జున ప్రసాద్, పుష్పగిరి, వహీద్ పాషా, శ్రీనివాస్ రెడ్డి, కానిస్టేబుల్స్ నరేష్, శివరాజ్, సాయి దస్తగిరి, రామ్ రెడ్డి లను డిఎస్పీ అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.