📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriఘనంగా మహమ్మద్ అబ్దుల్ ఖయ్యూం జన్మదిన వేడుకలు

ఘనంగా మహమ్మద్ అబ్దుల్ ఖయ్యూం జన్మదిన వేడుకలు

📰 Generate e-Paper Clip

ఘట్కేసర్, మే 5 (ప్రజావాణి): మాజీ పీసీసీ సోషల్ మీడియా కోఆర్డినేటర్, మేడ్చల్ నియోజకవర్గానికి చెందిన మహమ్మద్ అబ్దుల్ ఖయ్యూం జన్మదిన వేడుకలను ఘట్కేసర్‌లోని బృందావన్ హోటల్‌లో కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఘట్కేసర్ మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ హాజరై ఖయ్యూం‌ను శాలువాతో సన్మానించి, కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ వేడుకలో మేడ్చల్ జిల్లా డీసీసీ కార్యదర్శి మామిళ్ల ముత్యాలు యాదవ్, మాజీ డీసీసీ సభ్యులు ఉల్లి ఆంజనేయులు, బర్ల రాధాకృష్ణ ముదిరాజ్  మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు కోరుబోతు నాగరాజు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ మల్లేష్, హోటల్ యజమానులు బాబురావు, వెంకటనారాయణ, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బొక్క సంజీవరెడ్డి, ఉపాధ్యక్షుడు రఫీ ఉద్దీన్, సీనియర్ పాత్రికేయులు శివకృష్ణారెడ్డి, కిరణ్, అలాగే నాయకులు బొక్క సత్తిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, ఫరూక్ బేగ్, రెహమాన్, కట్టా సుధాకర్ రెడ్డి, కృష్ణ, బబ్లు, హరి వర్ధన్ రెడ్డి, శివరాత్రి సురేష్ తదితరులు పాల్గొని ఖయ్యూం‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా నాయకులు ఆయన రాజకీయ, సామాజిక సేవలను కొనియాడుతూ భవిష్యత్తులో మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.