📄 ePaper
Epaper 2
Monday, September 14, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSangareddy*కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది టీ జీ ఐ ఐ సి చైర్పర్సన్ నిర్మలా...

*కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది టీ జీ ఐ ఐ సి చైర్పర్సన్ నిర్మలా జయప్రకాశ్ రెడ్డి*

📰 Generate e-Paper Clip

*కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది టీ జీ ఐ ఐ సి చైర్పర్సన్ నిర్మలా జయప్రకాశ్ రెడ్డి*

*సంగారెడ్డిలో ఘనంగా మే డే వేడుకలు*

*మన సమగ్ర ప్రజావాణి మే 01 సంగారెడ్డి జిల్లా ప్రతినిది*



అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మే డే) సందర్భంగా సంగారెడ్డి శుక్రవారం నాడు కలెక్టరేట్ ఆడిటోరియంలో కార్మిక, ఉపాధి, శిక్షణ మరియు ఫ్యాక్టరీల శాఖల ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీజీఐసీ చైర్పర్సన్ నిర్మలా జయప్రకాశ్ రెడ్డి హాజరై కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా టీజీఐసీ చైర్పర్సన్ నిర్మలా జయప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ, దేశ అభివృద్ధికి కార్మికుల పాత్ర అమోఘమని అన్నారు. సమాజ నిర్మాణంలో కార్మికులు కీలక శక్తిగా నిలుస్తారని, వారి సంక్షేమం కోసం ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. కార్మికుల హక్కులను పరిరక్షించడంతో పాటు వారికి భద్రత, న్యాయం కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. ప్రతి కార్మికుడు గౌరవంతో జీవించేందుకు అవసరమైన అవకాశాలు కల్పించేందుకు కృషి కొనసాగుతుందని చెప్పారు.
ఈ సందర్బంగా అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి మాట్లాడుతూ, కార్మికులు తమ పనుల్లో భద్రతా నియమాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. పరిశ్రమలు, ఫ్యాక్టరీల్లో పని చేసే కార్మికుల రక్షణ కోసం తీసుకునే జాగ్రత్తలు ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. ప్రమాదాలను నివారించడంలో ప్రతి ఒక్కరి పాత్ర కీలకమని, అవగాహనతో పనిచేస్తే ప్రమాదాలను తగ్గించవచ్చని తెలిపారు.
అడిషనల్ కలెక్టర్ పాండు మాట్లాడుతూ, జిల్లాలో కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నామని వివరించారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు ప్రతి కార్మికుడికి చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
అనంతరం కార్యక్రమంలో కొందరు కార్మికులకు లేబర్ గుర్తింపు కార్డులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రభు గౌడ్,కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ రవీందర్ రెడ్డి ,అధికారులు, కార్మిక సంఘాల ప్రతినిధులు, కార్మికులు,విద్యార్థులు,తదితరు లు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.