📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriకార్మికులకు వైద్య, సామాజిక భద్రత కల్పించాలి: గాంధారి అశోక్ అంబేద్కర్ కృషితోనే కార్మిక హక్కులు...

కార్మికులకు వైద్య, సామాజిక భద్రత కల్పించాలి: గాంధారి అశోక్ అంబేద్కర్ కృషితోనే కార్మిక హక్కులు సాధ్యం: వినోద్ రెడ్డి

📰 Generate e-Paper Clip

ఘట్కేసర్, మే 1 (ప్రజావాణి):

అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మే డే) సందర్భంగా మేడ్చల్ జిల్లా పోచారం సర్కిల్ 8వ వార్డు రాజీవ్ గృహకల్పలోని వాటర్ ప్లాంట్ ప్రాంగణం, అన్నోజిగూడ ఎస్టీ కమ్యూనిటీ హాల్ వద్ద ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పోచారం డివిజన్ అధ్యక్షులు గాంధారి అశోక్ ఆధ్వర్యంలో ఎర్రజెండాను ఎగరవేసి, కార్మికులు పరస్పరం స్వీట్లు పంచుకుంటూ మే డే సంబరాలు జరుపుకున్నారు.

ఈ సందర్భంగా గాంధారి అశోక్ మాట్లాడుతూ కార్మికులకు వైద్య పరమైన మరియు సామాజిక భద్రత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కార్మికులపై పెరుగుతున్న పని భారం తగ్గించి, తగిన వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లు తీసుకురావడం ద్వారా కార్మిక హక్కులను బలహీనపరిచిందని విమర్శించారు. కార్మికులు ఐక్యంగా పోరాడి తమ హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు.

సిఐటియు పోచారం డివిజన్ క్యాషియర్ వినోద్ రెడ్డి మాట్లాడుతూ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కృషితోనే కార్మికులకు న్యాయబద్ధమైన కనీస వేతనాలు, పలు హక్కులు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. మే డే చరిత్రను కేవలం 1886 షికాగో పోరాటానికి మాత్రమే పరిమితం చేయకుండా, భారతదేశంలో అంబేద్కర్ చేసిన కృషిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి కార్మికులు వినోద్ రెడ్డి, డి. దవులు, శివ, ప్రభాకర్, సహదేవ్, సబ్బు నరసింహ, సిహెచ్ లింగస్వామి, ఆంజనేయులు, మురళి, కిరణ్, స్వామి, రవి, వినోద్, జమ్మన్న, కే మమత, ఎస్ శాంతమ్మ, ఆర్ కళావతి, జి హేమలత, పి లత, డి వెంకటమ్మ, ఆర్ ఐలమ్మ, కే సుగుణ, కే కవిత, ఎస్ జంగమ్మ, డి మౌనిక, వాణి, కృష్ణవేణి, జి సరిత, సిహెచ్ ఎల్లమ్మ, మంజుల, జి శ్రావణి, జి అందాలు, పి సంగీత, జి సావిత్రి, విజయ, లలిత తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.