📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణRangareddyఅమీనా ప్రతిభకు తెలంగాణ రక్షణ సేన అభినందనలు – ముస్లిం మహిళలు ఉన్నత చదువుల్లో రాణించాలి...

అమీనా ప్రతిభకు తెలంగాణ రక్షణ సేన అభినందనలు – ముస్లిం మహిళలు ఉన్నత చదువుల్లో రాణించాలి తెలంగాణ రక్షణ సేన ముస్లిం మైనార్టీ రాష్ట్ర నాయకులు ఎండి ముస్తఫా

📰 Generate e-Paper Clip

అమీనా ప్రతిభకు తెలంగాణ రక్షణ సేన అభినందనలు – ముస్లిం మహిళలు ఉన్నత చదువుల్లో రాణించాలి
తెలంగాణ రక్షణ సేన ముస్లిం మైనార్టీ రాష్ట్ర నాయకులు ఎండి ముస్తఫా
ఇటీవల విడుదలైన పదో తరగతి (SSC) ఫలితాలలో కేశంపేట మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాల విద్యార్థిని అమీనా 600 మార్కులకు గాను 581 మార్కులు సాధించి అద్భుత ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా తెలంగాణ రక్షణ సేన ముస్లిం మైనార్టీ రాష్ట్ర నాయకులు ఎండి ముస్తఫా ఆధ్వర్యంలో విద్యార్థిని అమీనాను, వారి తల్లిదండ్రులను ఘనంగా సత్కరించారు.
విద్యార్థిని అమీనాకు శాలువా కప్పి, స్వీట్లు తినిపించి, బహుమతిని అందజేసి తమ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎండి ముస్తఫా మాట్లాడుతూ, అమీనా రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత చదువులు చదివి సమాజంలో మంచి గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు. పైచదువుల కోసం తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని భరోసా ఇచ్చారు.
ముస్లిం మహిళా సాధికారతపై పిలుపు
ముస్లిం మహిళలు విద్యారంగంలో ముందడుగు వేయాలని, ఉన్నత చదువులు చదివి సమాజంలో గౌరవప్రదమైన స్థానాల్లో రాణించాలని ఆయన పిలుపునిచ్చారు.
“చదువు ఒక్కటే పేదరికాన్ని పారద్రోలే ఆయుధం. కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించినప్పుడే సమాజంలో మనకు తగిన గుర్తింపు లభిస్తుంది” అని పేర్కొన్నారు.
తెలంగాణ రక్షణ సేన హామీ
రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణ రక్షణ సేన ప్రభుత్వం ఏర్పడిన అనంతరం రాష్ట్రంలోని పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాల వారికి సంపూర్ణ ఉచిత విద్య అందజేస్తామని ఈ సందర్భంగా ఎండి ముస్తఫా తెలిపారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం తమ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన విద్యార్థి విభాగం నాయకుడు మహేష్ కుమార్, నాయకులు నవీన్ కుమార్, బాలాజీ ఉదయ్, రవి, రాజు, పాండు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.