📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్అధికార దాహం.. గోమాత శోకం.. ప్రొద్దుటూరు రాజకీయాల అసలు రంగు.! ఎస్.ఎస్. మాల్.. చుట్టూ రాజకీయం.....

అధికార దాహం.. గోమాత శోకం.. ప్రొద్దుటూరు రాజకీయాల అసలు రంగు.! ఎస్.ఎస్. మాల్.. చుట్టూ రాజకీయం.. ఆకలి కేకలతో నడిగడ్డపై గోమాత నరకం

📰 Generate e-Paper Clip

కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (మే07) ప్రొద్దుటూరు గడ్డ నేడు రాజకీయ నేతల స్వార్థ ప్రయోజనాలకు వేదికగా మారి కునారిల్లిపోతోంది.అభివృద్ధి అంటే కేవలం విమర్శలు,ప్రతివిమర్శలు అనుకుంటున్న నాయకుల మధ్య అసలైన.ధర్మం.అగాధంలోకి వెళ్ళిపోతోంది.గత వారం రోజులుగా ప్రొద్దుటూరు నడిబొడ్డున ఉన్న ఎస్.ఎస్.మాల్ చుట్టూ జరుగుతున్న వివాదం,పరస్పర దూషణలు చూస్తుంటే ప్రొద్దుటూరు రాజకీయ ముఖచిత్రం ఎంతగా దిగజారిపోయిందో అర్థమవుతోంది.​రెండున్నర కోట్ల రాజకీయం.లక్షల ప్రాణాల విలువ ఎంత ప్రొద్దుటూరులో ఇప్పుడు ఎక్కడ చూసినా ఎస్.ఎస్.మాల్ ముచ్చటే.అధికార పక్షం,ప్రతిపక్షం.అటు వైఎస్సార్సీపీ,ఇటు టీడీపీ నేతలు.ప్రెస్ మీట్లు పెట్టి ఒకరి జుట్టు ఒకరు పట్టుకునే స్థాయిలో మైకుల ముందు గర్జిస్తున్నారు.కేవలం రెండున్నర కోట్ల రూపాయల అంశమే వీరి రాజకీయ అస్తిత్వానికి ప్రాణవాయువులా మారిపోయింది.కానీ,అదే పట్టణ కూడళ్లలో,మున్సిపల్ చెత్త కుప్పల వద్ద ఆకలితో అలమటిస్తూ మరణిస్తున్న గోమాతల దృశ్యాలు వీరి కంటికి ఎందుకు ఆనడం లేదు.గోమాత అర్తనాదం. నాయకుల మౌనం.సకల దేవతలకు నిలయమని,ముక్కోటి దేవతలు కొలువుంటారని పూజించే గోమాత నేడు ప్రొద్దుటూరు వీధుల్లో అనాథగా,దిక్కులేక విలవిలలాడుతోంది.విషతుల్యమైన ఆహారం.తాగడానికి చుక్క నీరు లేదు,మేతకు గడ్డి పరక లేదు.ఆకలి తట్టుకోలేక ప్రజలు పారేసిన ఎంగిలి మెతుకుల కోసం ప్లాస్టిక్ కవర్లను సైతం మింగుతూ,అవి కడుపులో పేగులకు చుట్టుకుపోయి నరకయాతన అనుభవిస్తూ ప్రాణాలు విడుస్తున్నాయి.వేషధారణలో భక్తి.చేతల్లో శూన్యం.ఇదే నాయకులు గుళ్ళు,గోపురాలకు వెళ్ళినప్పుడు ఫోటోల కోసం గోవులకు పట్టువస్త్రాలు కప్పి,హారతులు ఇచ్చి భక్తి నటిస్తారు.అదే గోవు వీధిలో ఎండకు ఎండుతూ,ఆకలితో అరుస్తుంటే కనీసం పక్కకు నెట్టేసే సంస్కారం కూడా లేకుండా కార్లలో దూసుకుపోతున్నారు.ఓటు లేని జీవికి విలువే లేదు.!గోమాతకు ఓటు వేసే హక్కు ఉండి ఉంటే,ఈ నాయకులు ఈ పాటికి పట్టణమంతా ఏసీ గోశాలలు నిర్మించి ఉండేవారు.ఆ మూగజీవానికి ఓటు లేదు కాబట్టే, దాని చావు ఈ నేతలకు లెక్కలోకి రావడం లేదు.రాజకీయ లబ్ధి కోసం మనుషుల మధ్య చిచ్చు పెట్టే మీకు,ప్రాణం ఉన్న జీవాలను కాపాడే మనసు ఎందుకు రావడం లేదు.మీ రాజకీయ యుద్ధం ఎస్.ఎస్.మాల్ కోసమా లేక మీ జేబులు నింపుకోవడానికా.​కాలజ్ఞానం హెచ్చరిక.నాశనానికి నాంది.450 ఏళ్ళ క్రితమే పరమయోగి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు.నడిగడ్డ నాశనమవుతాది.. అని చెప్పిన మాటలు అక్షర సత్యాలు కాబోతున్నాయా అన్న భయం భక్తుల్లో కలుగుతోంది.ఏ గడ్డపై గోమాత కన్నీరు కారుస్తుందో,అక్కడ అభివృద్ధి ఆవిరైపోతుంది.ఈ రాజకీయ నాయకుల వైఖరి చూస్తుంటే,వారి రాజకీయ సమాధికి వారే పునాది వేసుకుంటున్నారని ఆధ్యాత్మిక ప్రవచనకారులు హెచ్చరిస్తున్నారు.రాజకీయం అంటే కేవలం అధికార పీఠం కాదు, ధర్మాన్ని కాపాడటం.గోమాత శాపం తగిలితే ఏ సామ్రాజ్యమైనా మట్టిలో కలవాల్సిందే.ఎస్.ఎస్.మాల్ మీ టార్గెట్ కావచ్చు,కానీ మీ నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు కోల్పోతున్న గోమాతల పాపం మిమ్మల్ని వదలదు..​ప్రొద్దుటూరు ప్రజల పక్షాన,ఆధ్యాత్మిక వేత్తల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం..​తక్షణమే పట్టణంలోని అనాథ గోవుల కోసం ప్రభుత్వ గోశాలలు ఏర్పాటు చేయాలి.​ప్రతి వీధిలో ఎండ తీవ్రతను తట్టుకునేలా నీటి తొట్లు నిర్మించాలి.రాజకీయ విమర్శలకు కేటాయించే సమయంలో కనీసం పది శాతం అయినా గోరక్షణ కోసం కేటాయించాలి.నాయకులారా.కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు.గోమాత ఆర్తనాదాలను వినకపోతే,ప్రజల ఆగ్రహానికి మీ రాజకీయ ఉనికి మరుగున పడిపోవడం ఖాయం.. ఇప్పటికైనా కళ్ళు తెరవండి.మూగజీవాలను కాపాడండి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.