📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriఅక్రమ నిర్మాణాలు, అనుమతి లేని డ్రైనేజ్ కనెక్షన్లపై ప్రజావాణిలో ఫిర్యాదు

అక్రమ నిర్మాణాలు, అనుమతి లేని డ్రైనేజ్ కనెక్షన్లపై ప్రజావాణిలో ఫిర్యాదు

📰 Generate e-Paper Clip

ఘట్కేసర్, మే 4 (ప్రజావాణి):  ఘట్కేసర్ మున్సిపల్ పరిధిలోని ఘనపూర్ గ్రామంలో అక్రమ నిర్మాణాలు, అనుమతి లేకుండా డ్రైనేజ్ కనెక్షన్లు కలుపుతున్న ఘటనలు కొనసాగుతున్నాయని మాజీ సర్పంచ్ వేముల సంజీవ్ గౌడ్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

వివరాల ప్రకారం, గ్రామంలో ఎలాంటి అధికార అనుమతులు లేకుండా భవన నిర్మాణాలు జరుగుతున్నాయని, ఆ భవనాలకు సంబంధించి డ్రైనేజ్ కనెక్షన్లు కూడా అనధికారికంగా ప్రధాన లైన్లకు కలుపుతున్నారని పేర్కొన్నారు. ఈ విషయంపై ఇప్పటికే ఫోన్ ద్వారా, అలాగే ఏప్రిల్ 24న ప్రజావాణిలో ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు.

రెండు రోజుల పాటు పనులు ఆపినట్లు చూపించి, అనంతరం మళ్లీ అక్రమంగా నిర్మాణాలు కొనసాగిస్తూ డ్రైనేజ్ కనెక్షన్లు పూర్తి చేస్తున్నారని ఆయన అన్నారు. కొందరు సిబ్బంది సహకారంతోనే ఈ అక్రమాలు సాగుతున్నాయనే అనుమానం వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో మే 4న మరోసారి ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. సంబంధిత సిబ్బందిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేయాలని, అక్రమ నిర్మాణాలపై విచారణ జరిపి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగించే ఇటువంటి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని, నిబంధనలు ఉల్లంఘించిన నిర్మాణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సంజీవ్ గౌడ్ ప్రజావాణి, వినతి పత్రంలో తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.