📄 ePaper
ePaper2
Saturday, September 12, 2026
📄 ePaper
EVENING EDITION

📰 Generate e-Paper Clip

బట్రాజులను కించపరిచే వాక్యాలు చేస్తే సహించేది లేదు

ప్రభుత్వం నిరుపేద భట్రాజులకు సంక్షేమ పథకాలు అందించాలి.

కార్పొరేషన్ చైర్మన్ నియామకానికి ముఖ్యమంత్రి సహకరించాలి.

బట్రాజ్ సంఘం గౌరవ అధ్యక్షులు విలాస కవి రామరాజు డిమాండ్

ప్రజావాణి న్యూస్ సూర్యాపేట. బట్రాజులను కించపరిచే వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని సూర్యాపేట జిల్లా బట్రాజ్ సంఘం గౌరవ అధ్యక్షులు విలాస కవి రామరాజు అన్నారు సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సంఘం సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మొదటినుంచి కూడా బట్రాజులు మంచి గౌరవప్రదమైన పేరు ప్రతిష్టలను సంపాదించారని వాపోయారు. జిల్లాలో ఎన్నికలు జరిగి ఐదు సంవత్సరాలు అయినందున జిల్లాలో ఎన్నికల నిర్వహించారు. ఎన్నికల్లో జిల్లా అధ్యక్షులుగా బొల్లేపల్లి రఘురామరాజు మరియు గౌరవ అధ్యక్షులుగా విలాస కవి రామరాజు ప్రధాన కార్యదర్శిలుగా వేణుగోపాల కృష్ణంరాజు. దేనుమకొండ శేషం రాజు ఉపాధ్యక్షులు సరికొండ రామలింగరాజు మందపాటి శ్రీరామరాజు సరికొండ నాగరాజు కాసు రాఘవ రాజు మరియు. కోశాధికారి తంగేళ్ల చంద్రశేఖర్ రాజు. కార్యవర్గ సభ్యులు దేనుమకొండ పృథ్వీరాజు బొల్లెపల్లి రామచంద్ర రాజు ధూపాటి అంజమ్ రాజు హర్షవర్ధన్ రాజు దేనుమకొండ సైదరాజులు పదవులలో కొలువుదీరారు. తదనంతరం యువజన సంఘం ఎన్నికలు నిర్వహించగా మందపాటి శ్రీనివాసరాజు  ప్రధాన కార్యదర్శిగా సరికొండ చంద్రశేఖర్ రాజు ఉపాధ్యక్షులు కార్తీక్ రాజు సహాయ కార్యదర్శి వినయ్ రాజు కోశాధికారి హర్షవర్ధన్ రాజు ప్రచార కార్యదర్శి పున్నంరాజు కార్యవర్గ సభ్యులు నాగరాజు సాయి రాజు రిశి రాజు అరవింద రాజు యువజన సంఘం లో నియమితులు కావడం జరిగింది. సంఘ ఎన్నికల అనంతరం అధ్యక్షులు బొల్లేపల్లి రఘురామరాజు మాట్లాడుతూ కుల సంఘాలు ఏర్పరచుకునేది అందరినీ కలుపుకొని పోవడానికి గాని స్వార్థపూరితమైన మనసుతో ఒకరిని ఒకరు నిందించుకోవడం కోసం కాదు. ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద తేడా లేకుండా కలిసికట్టుగా ఉండి కుల అభివృద్ధికి సహకరించాలని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కుల బంధువులు పెద్దలు చిన్నలు మహిళలు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.