📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణJagtialసూరారంలో శ్రీ గణేష్ యూత్ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం

సూరారంలో శ్రీ గణేష్ యూత్ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం

📰 Generate e-Paper Clip

సూరారంలో చలివేంద్రం ప్రారంభం

శ్రీ గణేష్ యూత్ అసోసియేషన్ ముందడుగు

జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి ఏప్రిల్ 05 (ప్రజావాణి):

ఎండలు మండిపోతున్న నేపథ్యంలో బాటసారుల దాహార్తిని తీర్చేందుకు శ్రీ గణేష్ యూత్ అసోసియేషన్ సభ్యులు మానవత్వాన్ని చాటుకున్నారు. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం సూరారం గ్రామంలోని హైవే రోడ్డు సమీపంలో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన భూషణం, వెంకటేశం, ఆదినారాయణ రెడ్డిలతో పాటు అసోసియేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… వేసవి కాలంలో ప్రజలకు, బాటసారులకు తాగునీరు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, బాటసారులు పాల్గొని యువత చేస్తున్న ఈ సామాజిక సేవను అభినందించారు. గ్రామంలో ఇలాంటి మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని అసోసియేషన్ సభ్యులు నిర్ణయించారు. ఈ సేవా కార్యక్రమంలో యూత్ సభ్యులు ఉత్సాహంగా గణేష్, శ్రావణ్ కుమార్, శేఖర్, సాగర్, సంతోష్, రాకేష్, వంశీ, సృజన్, ఆనంద్, సాగర్, పవన్, ప్రణయ్, రామ్ చరణ్, రమేష్, సాగర్, శ్రావణ్, విష్ణు, రాకేష్, మనిదీపక్, విష్ణు వర్ధన్, సజాన్, వేణుమాధవ్, వెంకటేష్, పవన్ కుమార్, రాహుల్, సాయి, భాస్కర్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.