📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్శిల్పా ఎస్టేట్‌లో భారత స్వాతంత్ర్య సమరయోధురాలు, త్యాగమూర్తి కస్తూర్బా గాంధీ గారి జయంతి

శిల్పా ఎస్టేట్‌లో భారత స్వాతంత్ర్య సమరయోధురాలు, త్యాగమూర్తి కస్తూర్బా గాంధీ గారి జయంతి

📰 Generate e-Paper Clip

ఎమ్మిగనూరుప్రజావాణి న్యూస్ (ఏప్రిల్ 11)ఎమ్మిగనూరు పట్టణంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త వారి కార్యాలయం,శిల్పా ఎస్టేట్‌లో భారత స్వాతంత్ర్య సమరయోధురాలు,త్యాగమూర్తి కస్తూర్బా గాంధీ గారి జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాలు సమర్పించి ఘన నివాళులు అర్పించడం జరిగింది.ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ కస్తూర్బా గాంధీ గారు భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో అజరామరమైన స్థానం సంపాదించిన మహనీయురాలని కొనియాడారు.1869లో గుజరాత్ రాష్ట్రంలో జన్మించిన ఆమె చిన్ననాటి నుంచే సంప్రదాయబద్ధమైన కుటుంబంలో పెరిగినా, తరువాత కాలంలో గారి జీవిత భాగస్వామిగా మాత్రమే కాకుండా స్వతంత్రంగా దేశ సేవలో అంకితభావంతో ముందుకు సాగిన గొప్ప నాయకురాలిగా ఎదిగారని పేర్కొన్నారు.కస్తూర్బా గాంధీ గారు దక్షిణాఫ్రికాలోనే సత్యాగ్రహ ఉద్యమాల్లో పాల్గొని తన పోరాట జీవితాన్ని ప్రారంభించి,భారతదేశానికి వచ్చిన తరువాత అసహకార ఉద్యమం, సివిల్ డిసొబిడియన్స్ ఉద్యమం,ఉప్పు సత్యాగ్రహం వంటి పలు జాతీయోద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారని తెలిపారు.బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతూ అనేకసార్లు జైలు శిక్షలను అనుభవించిన ఆమె ధైర్యసాహసాలు మహిళలకు ప్రేరణగా నిలిచాయని అన్నారు.మహిళల చైతన్యానికి కస్తూర్బా గాంధీ గారు చేసిన సేవలు అపారమని నాయకులు కొనియాడారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలను స్వచ్ఛత, ఆరోగ్యం,విద్య,స్వయం సమృద్ధి దిశగా నడిపించి,సమాజంలో మహిళల స్థాయిని పెంచడంలో ఆమె కీలక పాత్ర పోషించారని తెలిపారు. సమాజంలో అణగారిన వర్గాలకు సేవ చేయడంలో ఆమె చూపిన కరుణ, సేవాభావం మానవత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు.ఆమె కేవలం రాజకీయ ఉద్యమకారిణిగానే కాకుండా,సేవా భావంతో కూడిన సమాజ సంస్కర్తగా కూడా నిలిచారని,అనాథలు, పేదలు, బాధితులకు ఆదరణగా నిలిచిన ఆమె జీవిత గాథ నేటి తరాలకు మార్గదర్శకమని అన్నారు. మహిళలు సమాజంలో ముందుకు రావాలని, విద్యను సాధనగా చేసుకుని స్వయం ప్రతిభను పెంపొందించుకోవాలని ఆమె ఇచ్చిన సందేశం నేటికీ ప్రాసంగికమని పేర్కొన్నారు.కేంద్ర ప్రభుత్వం ఆమె సేవలను స్మరించుకుంటూ “కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (KGBV)”ను ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాల్లో బాలికలకు నాణ్యమైన విద్య అందించే కార్యక్రమాలను కొనసాగిస్తోందని తెలిపారు. ఈ విద్యాసంస్థలు వేలాది బాలికలకు విద్యా వెలుగులు నింపుతూ కస్తూర్బా గాంధీ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నాయని అన్నారు.1944లో ఆమె పరమపదించినా,ఆమె సేవలు,త్యాగాలు భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచాయని నాయకులు కొనియాడారు.దేశ స్వాతంత్ర్యం కోసం,మహిళా సాధికారత కోసం,సమాజ సేవ కోసం ఆమె చేసిన కృషి యుగయుగాల పాటు గుర్తుండిపోతుందని తెలిపారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కస్తూర్బా గాంధీ గారి ఆశయాలను ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో ఆచరణలో పెట్టాలని,మహిళల అభివృద్ధి,విద్యా విస్తరణ,సమాజ సేవలో ముందుండాలని పిలుపునిచ్చారు.ఆమె చూపిన మార్గంలో నడవడం ద్వారానే నిజమైన నివాళి అర్పించినవారమవుతామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కె ఆర్ రామకోటేశ్వర్ రెడ్డి గారు,రాష్ట్ర బీసీ సెల్ సంయుక్త కార్యదర్శి ముగతి వీరుపాక్షి రెడ్డి గారు,మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ & నియోజకవర్గ యువజన విభాగ అధ్యక్షులు డి నజీర్ అహ్మద్ గారు, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి యు.కె. రాజశేఖర్ గారు,చేనేత జిల్లా అధ్యక్షులు ఎంకే శివప్రసాద్, జిల్లా ఎస్సీ సెల్ కార్యవర్గ సభ్యులు కొరిశెట్టి మధుబాబు,పట్టణ అధ్యక్షులు కామర్తి నాగేశప్ప, పట్టణ ప్రధాన కార్యదర్శి గడ్డం అంజి,పట్టణ కార్యదర్శులు అల్తాఫ్ ,గురువ మా భాష,ఎమ్మిగనూరు మండల కార్యదర్శి తిమ్మాపురం బోయ బజారి,పట్టణ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి మంజునాథ్ గారు,15వ వార్డు ఇంచార్జ్ సయ్యద్ ఫయాజ్,నాయకులు డా.వీరాంజనేయులు, బనవాసి రాజ్ కుమార్,షేక్ మహబూబ్ బాషా, కందనాతి దానియేలు తదితరులు పాల్గొని కస్తూర్బా గాంధీ గారికి ఘనంగా నివాళులు అర్పించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.