📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణWarangalవ్యవసాయ శాఖ అధికారి మరియు సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ కలిసి హార్వెస్టర్ యజమానులు, డ్రైవర్లకు...

వ్యవసాయ శాఖ అధికారి మరియు సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ కలిసి హార్వెస్టర్ యజమానులు, డ్రైవర్లకు కౌన్సిలింగ్

📰 Generate e-Paper Clip

వ్యవసాయ శాఖ అధికారి మరియు సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ కలిసి హార్వెస్టర్ యజమానులు, డ్రైవర్లకు కౌన్సిలింగ్

ప్రజావాణి శాయంపేట

మండలంలోని వివిధ గ్రామాల నుండి హార్వెస్టర్ ఓనర్ డ్రైవర్లకు
పాడి పంట కోత సమయంలో రైతుల పంటకు ఎటువంటి నష్టం కలగకుండా ప్రభుత్వం నిర్ణయించిన ప్రమాణాలు, జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
హార్వెస్టర్ వినియోగంలో పాటించాల్సిన ముఖ్యసూచనలు
కోత మిషన్ ఉపయోగించే సమయంలో బ్లోయర్  తప్పనిసరిగా ఆన్ లో ఉంచాలి.
మిషన్ ఆర్ పి యం ను 19,20వరకు నిర్వహించాలి.
గేర్ స్నాట్ ను ఎ2 నుంచి బి1 స్థాయిలో ఉంచాలి.
కోత సమయంలో ధాన్యం శుభ్రంగా ఉండేలా చూసి, చెత్త, పొడి వేరుపడేలా చర్యలు తీసుకోవాలి ధాన్యం వృథా కాకుండా, నష్టం లేకుండా జాగ్రత్తగా కోత నిర్వహించాలి.
రైతులతో సమన్వయం కలిగి, వారి సూచనలు పాటిస్తూ పని చేయాలి.కోత చేసిన ధాన్యాన్ని నేలమీద పడకుండా, శుభ్రంగా సేకరించే విధంగా యంత్రాన్ని నడపాలి.మండల వ్యవసాయ అధికారి ప్రియదర్శిని మాట్లాడుతూ, “హార్వెస్టర్లు సాంకేతిక ప్రమాణాల ప్రకారం పనిచేయడం చాలా ముఖ్యము. రైతుల పంట నాణ్యతను కాపాడటం అందరి బాధ్యత. ప్రతి డ్రైవర్ బాధ్యతాయుతంగా వ్యవహరించి, ధాన్యం నష్టం లేకుండా చూడాలి” అని తెలిపారు.
ఎస్సై జక్కుల పరమేశ్వర్ మాట్లాడుతూ, “నిబంధనలు ఉల్లంఘించడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం లేదా రైతులకు నష్టం కలిగించడం జరిగితే సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తప్పవు. అందరూ క్రమశిక్షణతో, బాధ్యతతో పని చేయాలి” అని హెచ్చరించారు.
అధికారులు అందరికీ సమన్వయంతో పనిచేసి, రైతులకు నష్టం లేకుండా పంట కోత కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.