📄 ePaper
Epaper 2
Sunday, September 13, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్ముడుపుల వేముల గ్రామ సచివాలయం ఆకస్మిక తనిఖీ చేపట్టిన ఆర్డీవో శ్రీనివాస్.

ముడుపుల వేముల గ్రామ సచివాలయం ఆకస్మిక తనిఖీ చేపట్టిన ఆర్డీవో శ్రీనివాస్.

📰 Generate e-Paper Clip

అన్నమయ్య జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్16) పీలేరు మండలం ముడుపులు వేముల గ్రామం సచివాలయం ఆకస్మిక తనిఖీ చేపట్టి ఆర్డీవో శ్రీనివాస్ రికార్డులు పరిశీలించారు.ఈ సందర్భంగా సచివాలయంలో అందుబాటులో ఉన్న గ్రామ రెవెన్యూ అధికారి వెంకటేష్, గ్రామ సర్వేయర్ నరేంద్ర, డిజిటల్ అసిస్టెంట్ విజయ్, విలేజ్ పోలీస్ భార్గవి వెటర్నరీ అసిస్టెంట్లు అందరూ అందుబాటులో ఉండటంతో అందుబాటులో లేని వారిపై ఆర్డిఓ విచారించారు అయితే కొంతమంది గ్రామ సచివాలయం ఉద్యోగులు వృత్తిరీత్యా జనాభా లెక్కల కోసం వెళ్లారని మరికొందరు సకాలంలో అందుబాటులో లేకపోవడంతో సిబ్బంది వివరాలు క్షుణంగా పరిశీలించి అడిగి తెలుసుకున్నారు గ్రామ సచివాలయంలో పని చేస్తున్న డిజిటల్ అసిస్టెంట్ విజయ్ ని పలుమార్లు అనేక గ్రామ సమస్యలపై అడిగి తెలుసుకున్నారు.సచివాలయంలో సిబ్బంది సకాలంలో ప్రజలు రైతులకు అందుబాటులో ఉండాలని ఆయన సూచించారు.ఆర్డీవో మరి కొంతమందిని రైతులతో ముచ్చటించారు. ఏదేమైనప్పటికీ అకస్మాత్తుగా గ్రామ సచివాలపై ఆర్డిఓ దృష్టి పెట్టడంతో సచివాలయాలని అప్రమత్తం అవుతున్నట్లు తెలిసింది.ఈ కార్యక్రమంలో పీలేరు తహశీల్దారు శివ కుమార్, ఆర్ ఐ మురగయ్య, రెవిన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.