📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్మహిళలను ఆర్థిక శక్తిగా మారుస్తాం

మహిళలను ఆర్థిక శక్తిగా మారుస్తాం

📰 Generate e-Paper Clip

గుంటూరుజిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్ 22) గుంటూరు తూర్పు ఎమ్మెల్యే కుట్టుశిక్షణతో స్వయం ఉపాధి* మహిళలను ఉపాధి రంగాల్లో ప్రోత్సహిస్తాం అంజుమన్ ఇస్లామియా ఆధ్వర్యంలో మహిళలకు కుట్టుశిక్షణ శిక్షణ పూర్తి చేసున్న వారికి సర్టిఫికెట్లు ప్రదానం చేసిన ఎమ్మెల్యే నసీర్ సమాజంలో మహిళలు ఇంటి బాధ్యత, పిల్లల సంరక్షణ, కుటుంబ సంక్షేమాన్ని సరిదిద్దుకుంటూనే స్వయం ఉపాధి వైపు అడుగులు వేయడం అభినందనీయమని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే, అసెంబ్లీ మైనారిటీస్ కమిటీ చైర్మన్ నసీర్ అన్నారు. స్థానిక అంజుమన్ ఇస్లామియా పాఠశాలలో అంజుమన్ ఇస్లామియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లో 90 రోజులపాటు కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న 37 మంది మహిళలకు బుధవారం సర్టిఫికెట్ల ప్రదానోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే నసీర్ మాట్లాడుతూ కుట్టు శిక్షణ మహిళల పట్టుదల, సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం పెంపొదిస్తుందని చెప్పారు. స్కిల్ డెవలప్ మెంట్ ఇచ్చిన ఈ అవకాశం, మహిళల జీవితాన్ని మార్చే శక్తిగా మారుతుందని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్ మెంట్ ద్వారా ఎందరో మహిళల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటుగా నిలుస్తున్నారని చెప్పారు. మహిళ ఒక అడుగు ముందుకు వేస్తే, కుటుంబం ముందుకు సాగుతుందని తెలిపారు. కుటుంబం ముందుకు వెళితే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ రోజు మహిళలు పొందిన సర్టిఫికెట్ కేవలం ఒక కాగితం కాదని, వారికి కృషికి గుర్తింపు అని చెప్పారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రతి మహిళా ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అంజుమన్ ఇస్లామియా ఆధ్వర్యంలో మరికొంత మహిళలు ఉచిత కుట్టుశిక్షణ పొందుతున్నారని చెప్పారు. ఇప్పటికే జాబ్ మేళా ద్వారా ఎందరో నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపామని, ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేయడమే లక్ష్యంగా పని ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.