📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతిని పురస్కరించుకుని ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించాను;;బద్వేలు...

మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతిని పురస్కరించుకుని ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించాను;;బద్వేలు కూటమి అభ్యర్థి బొజ్జ రోషన్న

📰 Generate e-Paper Clip

ప్రజావాణిన్యూస్(ఏప్రిల్11)బద్వేలు మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతిని పురస్కరించుకుని ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించాను. ఈ సందర్భంగా తరగతి గదులకు వెళ్లి విద్యార్థులతో ముచ్చటించి, డిజిటల్ క్లాసుల నిర్వహణ గురించి అడిగి తెలుసుకున్నాను. విద్యార్థులకు నా వంతు ప్రోత్సాహంగా నోట్ బుక్కులు, రైటింగ్ ప్యాడ్‌లు (అట్టలు), మరియు పెన్నులను పంపిణీ చేయడం జరిగింది.అనంతరం ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన’ పథకాన్ని పరిశీలించి, విద్యార్థులతో కలిసి భోజనం చేశాను. భోజనం చేసే సమయంలో విద్యార్థులు తమ సమస్యలను నా దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా డైనింగ్ హాల్‌లో ఫ్యాన్లు లేక ఇబ్బంది పడుతున్నామని వారు తెలపడంతో, తక్షణమే స్పందించి అక్కడ ఫ్యాన్లను ఏర్పాటు చేయించాను. విద్యార్థుల విద్యాభ్యాసానికి ఎటువంటి ఆటంకం కలగకుండా అండగా నిలవడమే మన లక్ష్యం.ఈ కార్యక్రమంలో బద్వేలు కూటమి అభ్యర్థి బొజ్జ రోషన్న, మున్సిపాలిటీ అధ్యక్షుడు గుర్రంపాటి వెంగల్ రెడ్డి, బద్వేల్ మండల పార్టీ అధ్యక్షులు బసిరెడ్డి రవికుమార్ రెడ్డి, అట్లూరు మండల పార్టీ అధ్యక్షులు పాపుదిప్పు మల్లికార్జున రెడ్డి, బి.కోడూరు మండల పార్టీ అధ్యక్షులు రామచంద్రారెడ్డి, జిల్లా వైస్ ప్రెసిడెంట్ సీతా వెంకటసుబ్బయ్య, నాయి బ్రాహ్మణ స్టేట్ డైరెక్టర్ కొడవలి వేణుగోపాల్, నరసింహనాయుడు, బైసాని ప్రతాపరెడ్డి, కనుమర్లపూటి ప్రసాద్, బోరెడ్డి జగదీశ్వర్ రెడ్డి, రాధాకృష్ణారెడ్డి, సింగరయ్య, బిగ్ బాస్, వెంకటయ్య, PRP భాష, ఐజయ్య, అబ్రహం, రామ సుబ్బారెడ్డి, సాయి శివారెడ్డి, హాబీబ్, ఉంటా నరసింహులు, మస్తాన్ బాబు, ఎల్లారెడ్డి, శివ, మజ్జారి చెన్నయ్య, ఎద్దుల ప్రసాద్, నవ్య జ్యోతి రెడ్డి, PRP వెంకటసుబ్బయ్య మరియు ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు…

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.