📄 ePaper
Epaper 2
Sunday, September 13, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్బేరం కుదిరింది,,స్లాబ్ పడింది! తాడిగడపలో అక్రమ నిర్మాణాల హడావిడి * అధికారుల మౌనం అనుమానాస్పదం* కామినేని...

బేరం కుదిరింది,,స్లాబ్ పడింది! తాడిగడపలో అక్రమ నిర్మాణాల హడావిడి * అధికారుల మౌనం అనుమానాస్పదం* కామినేని హాస్పిటల్ సమీపంలో భారీ నిర్మాణం – అనుమతులపై సందేహాలు*

📰 Generate e-Paper Clip

కృష్ణా జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్ 29) విజయవాడ  తాడిగడప మున్సిపల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు విస్తృతంగా సాగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా కామినేని హాస్పిటల్‌కు ఆనుకుని ఉన్న 100 అడుగుల రహదారి, సాయిబాబా గుడి పక్కనున్న సందులో భారీ నిర్మాణం జరుగుతుండడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. సంబంధిత నిర్మాణానికి అనుమతులు ఉన్నాయా? లేకపోతే ఎలా ఇంత వేగంగా పనులు సాగుతున్నాయి? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.గతంలో అడ్డుకున్న నిర్మాణమే,ఇప్పుడు ఎలా సక్రమం?ఈ నిర్మాణం గతంలో అక్రమంగా గుర్తించి సెంట్రింగ్ తొలగించి పనులను నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అదే నిర్మాణం మళ్లీ వేగంగా కొనసాగుతుండడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మధ్యలో ఏమి మారింది? అనేది ప్రజల్లో అనుమానాలను రేకెత్తిస్తోంది.ముడుపుల మాయలో ప్లానింగ్ సిబ్బంది?ప్లానింగ్ విభాగ సిబ్బందికి ముడుపులు అందిన తర్వాతే నిర్మాణానికి పచ్చజెండా,లభించిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనలు పక్కనపెట్టి అక్రమాలకు మద్దతుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కమిషనర్ పాత్రపై ప్రశ్నలు ఈ వ్యవహారంలో మున్సిపల్ కమిషనర్ పాత్రపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన కనుసన్నల్లోనే అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయా? లేకపోతే అవగాహన లేకుండా జరుగుతున్నాయా? అన్నది స్పష్టతకు రావాల్సిన అంశంగా మారింది.పురపాలక శాఖ డైరెక్టర్‌కు ఫిర్యాదు సిద్ధం*తాడిగడపలో జరుగుతున్న అక్రమాలపై కొందరు స్థానికులు పురపాలక శాఖ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అధికారుల నిర్లక్ష్యంపై ఉన్నత స్థాయిలో విచారణ జరపాలని వారు డిమాండ్ చేస్తున్నారు.ప్రభుత్వం జోక్యం అవసరం ప్రజల డిమాండ్ము న్సిపల్ ఆదాయానికి గండి కొట్టే ఈ అక్రమ నిర్మాణాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అక్రమాలకు అడ్డుకట్ట వేయడంలో విఫలమవుతున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, పారదర్శక వ్యవస్థను నెలకొల్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరవాలితాడిగడపలో జరుగుతున్న ఈ నిర్మాణాలపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు స్పష్టంగా చెబుతున్నారు. లేకపోతే,అక్రమమే సక్రమం, అన్న భావన బలపడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.