బేరం కుదిరింది,,స్లాబ్ పడింది! తాడిగడపలో అక్రమ నిర్మాణాల హడావిడి * అధికారుల మౌనం అనుమానాస్పదం* కామినేని హాస్పిటల్ సమీపంలో భారీ నిర్మాణం – అనుమతులపై సందేహాలు*

కృష్ణా జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్ 29) విజయవాడ  తాడిగడప మున్సిపల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు విస్తృతంగా సాగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా కామినేని హాస్పిటల్‌కు ఆనుకుని ఉన్న 100 అడుగుల రహదారి, సాయిబాబా గుడి పక్కనున్న సందులో భారీ నిర్మాణం జరుగుతుండడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. సంబంధిత నిర్మాణానికి అనుమతులు ఉన్నాయా? లేకపోతే ఎలా ఇంత వేగంగా పనులు సాగుతున్నాయి? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.గతంలో అడ్డుకున్న నిర్మాణమే,ఇప్పుడు ఎలా సక్రమం?ఈ నిర్మాణం గతంలో అక్రమంగా గుర్తించి సెంట్రింగ్ తొలగించి పనులను నిలిపివేసిన విషయం...