📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSiddipetబెజ్జంకి లో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు

బెజ్జంకి లో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు

📰 Generate e-Paper Clip

బెజ్జంకి లో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు

బెజ్జంకి, ఏప్రిల్ 5(ప్రజావాణి )

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో రతదేశ మాజీ ఉప ప్రధాని, సమతావాది డా. బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బెజ్జంకి మండలంలోనీ ప్రజా సంఘాల సమన్వయంతో ఉత్సవ కమిటీ అధ్యక్షులు సానగొండ శరత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా బాబు జగ్జీవన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక సర్పంచ్ శ్రీ బొల్లం శ్రీధర్ పాల్గొని మాట్లాడుతూ,బాబు జగ్జీవన్ రామ్ అట్టడుగు, బడుగు,బలహీన వర్గాల అభ్యున్నతి కోసం చేసిన సేవలను స్మరించుకొని,స్వాతంత్ర్య సమరయోధుడిగా, రాజకీయవేత్తగా, సంఘసంస్కర్తగా ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని,సుమారు 40 సంవత్సరాల పాటు కేంద్ర మంత్రిగా పనిచేసి దేశానికి విశేష సేవలందించారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ దూమాల మహేష్, వార్డు సభ్యులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, సంఘాల ప్రతినిధులు,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.