📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్బీజేవైఎం నాయకులపై బిఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసు కొట్టివేసిన న్యాయస్థానం

బీజేవైఎం నాయకులపై బిఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసు కొట్టివేసిన న్యాయస్థానం

📰 Generate e-Paper Clip

బీజేవైఎం నాయకులపై బిఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసు కొట్టివేసిన న్యాయస్థానం

బిఆర్ఎస్ అక్రమ కేసుకు ఐదేండ్లు

కొందుర్గు మండల కేంద్రంలో కాలేజ్ ఏర్పాటు చేయాలని, జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేస్తామని అడిగితే గత బిఆర్ఎస్ ప్రభుత్వం బీజేవైఎం నాయకులపై అక్రమ కేసు నమోదు చేసిన వ్యవహారంలో ఐదేళ్ల తర్వాత ఈ కేసులో తుది తీర్పు వచ్చింది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజక వర్గం కొందుర్గు మండల కేంద్రంలో గత జులై 22 నాడు 2021వ సంవత్సరంలో నాటి మంత్రుల సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణి, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ల పర్యటనలో భాగంగా ఎన్నో సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నటువంటి మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని బీజేవైఎం ఆధ్వర్యంలో మంత్రులను అడ్డుకోవడం జరిగింది. ఆ ధర్నా ఉదృతంగా నెలకొని గత బిఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ నాయకులు పైన అక్రమంగా కేసు పెట్టడం జరిగింది. ఈ కేసులో ఏ1గా బోయ అశోక్ ఏ2 నరేందర్, ఏ3గా ప్రస్తుత కౌన్సిలర్ ప్యాట అశోక్ కుమార్ ఏ4 గా మధు, ఏ5గా పెరుమల్ల యాదయ్య A6 గా శనమోని యాదయ్య ఏ7గా ఆనంద్ కుమార్ ఏ8 గా కిరణ్ కుమార్ ఏ9గా బైకని లింగం యాదవ్ అందరిపైన అంక్రమ కేసులు పెట్టి ఐదు సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరగడం జరిగిందనీ వారు పేర్కొన్నారు. పేద విద్యార్థుల కోసం ఆనాడు జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని బీజేవైఎం ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది. మరి ఈరోజు కేసు కొట్టివేస్తూ షాద్ నగర్ న్యాయస్థానం తీర్పు ఇవ్వడం జరిగిందన్నారు. మండల కేంద్రంలో జూనియర్ కళాశాల ఏర్పాటు జరగలేదు ఇంకా కానీ జూనియర్ కళాశాల ఏర్పాటు కోసం మా పోరాట నిరంతరం ఉంటదని బిజెపి నాయకులు తెలియజేయడం జరిగింది. కోర్టులో న్యాయవాది మనోహర్ రెడ్డి తన వాదనలు వినిపించినట్లు నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా న్యాయవాదికి వారు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు న్యాయవాది కందూరి మనోహర్ రెడ్డి పాల్గొన్నారు.. *KP*

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.