📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్బద్వేల్ టీడీపీ వర్గపోరుతో సీసీ రోడ్ల పనులు నిలిపివేత దురదృష్టకరం - తక్షణమే పనులు ప్రారంభించాలి:...

బద్వేల్ టీడీపీ వర్గపోరుతో సీసీ రోడ్ల పనులు నిలిపివేత దురదృష్టకరం – తక్షణమే పనులు ప్రారంభించాలి: సీపీఐ

📰 Generate e-Paper Clip

కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్23) బద్వేల్ పట్టణంలో మంజూరైన 3 కోట్ల రూపాయల సీసీ రోడ్ల పనులు టీడీపీ నాయకుల వర్గపోరు కారణంగా నిలిచిపోవడం దురదృష్టకరమని, అధికారుల పర్యవేక్షణతో తక్షణమే పనులు ప్రారంభించాలని కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) పట్టణ సమితి ఆధ్వర్యంలో గురువారం ఆర్డీవో మరియు మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ శ్రీ చంద్రమోహన్ గారికి వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్ మాట్లాడుతూ, బద్వేల్ పట్టణంలోని వివిధ వార్డులలో LSP, BPS కింద మంజూరైన 3 కోట్ల రూపాయల సీసీ రోడ్ల పనులకు రాజకీయ గ్రహణం పట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. భూమిపూజలకు ఎవరిని పిలవాలనే విషయంలో టీడీపీ వర్గపోరుతో పనులు జాప్యం అవుతున్నాయని తెలిపారు. ప్రోటోకాల్ లేని ఏ ఒక్కరినీ భూమిపూజలకు పిలవకుండా, అధికారుల పర్యవేక్షణలోనే సీసీ రోడ్ల నిర్మాణం కొనసాగించాలని డిమాండ్ చేశారు.బద్వేల్ నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నిధులు మంజూరు చేయించడంలో ఈ వర్గాలు పోటీ పడితే బాగుంటుందని హితవు పలికారు. అరకొర పనుల ప్రారంభోత్సవాలకు పోటీ పడటం “నవ్విపోదురు గాక నాకేంటి” అన్న చందంగా ఉందని ఎద్దేవా చేశారు.అదేవిధంగా మున్సిపాలిటీలో జరుగుతున్న సెంటర్ లైటింగ్ పనుల్లో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. మున్సిపల్ కమిషనర్ స్థానికుడు కావడంతో వారి బంధువులకు పలు పనులు అప్పగించారని ప్రజలు చర్చించుకుంటున్నారని, అంతేకాకుండా మున్సిపాలిటీ కార్మికుల చేత పనులు చేయిస్తూ, వేసిన రోడ్లు కూడా నాసిరకంగా ఉన్నాయని విమర్శించారు.బద్వేల్ పట్టణ అభివృద్ధికి రాజకీయాలకతీతంగా అందరూ దోహదపడాలని, వర్గపోరుతో అభివృద్ధికి ఆటంకం కలిగించవద్దని కోరారు. తక్షణమే ఆగిపోయిన సీసీ రోడ్ల పనులను ప్రారంభించకపోతే జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.వినతి పత్రం సమర్పించిన వారిలో:సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్, పట్టణ కార్యదర్శి బాలు, ఏరియా సహాయ కార్యదర్శి ఇమ్మానియేల్, పట్టణ సహాయ కార్యదర్శి పొంగూరు నాగరాజు, జిల్లా సమితి సభ్యులు పడిగే వెంకటరమణ, జి.ఎల్. నరసింహ, రమణయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.