📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్కూటమి ప్రభుత్వంలో బీసీ వర్గాలపై జరుగుతున్న అన్యాయాలు,నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ

కూటమి ప్రభుత్వంలో బీసీ వర్గాలపై జరుగుతున్న అన్యాయాలు,నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ

📰 Generate e-Paper Clip

అనంతపురం జిల్లా,ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్23) అనంతపురం,కూటమి ప్రభుత్వంలో బీసీ వర్గాలపై జరుగుతున్న అన్యాయాలు,నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీన నిర్వహించనున్న “బీసీ గళం” బహిరంగ సభను విజయవంతం చేయాలని పార్టీ నాయకులు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా బీసీ గళం కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను వైయస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మరియు బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ యాదవ్ గారు ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో మంగమ్మ,మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి,పార్టీ,ఇతర బీసీ నాయకులు పాల్గొన్నారు.నాయకులు మాట్లాడుతూ,ఎన్నికల సమయంలో బీసీలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. బీసీల ఆర్థిక, సామాజిక అభివృద్ధి కోసం చేపట్టాల్సిన పథకాలు నిలిచిపోయాయని,ఉపాధి అవకాశాలు తగ్గాయని,విద్య మరియు సంక్షేమ రంగాల్లో బీసీలకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు.బీసీ వర్గాల హక్కుల కోసం గళమెత్తే వేదికగా ఈ బీసీ గళంసభ నిలవనుందని పేర్కొన్నారు.రాష్ట్రవ్యాప్తంగా బీసీ నాయకులు,కార్యకర్తలు ప్రజలు పెద్దఎత్తున హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.ఈ బహిరంగ సభలో బీసీ వర్గాల సమస్యలను ప్రస్తావిస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని, భవిష్యత్ కార్యాచరణపై స్పష్టమైన దిశానిర్దేశం ఇవ్వబడుతుందని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.