EVENING EDITION
📄 ePaper
Sunday, September 13, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్నెల్లూరులో మెడికల్ మాఫియా దోపిడీ – పేదల ప్రాణాలతో వ్యాపారం!

నెల్లూరులో మెడికల్ మాఫియా దోపిడీ – పేదల ప్రాణాలతో వ్యాపారం!

📰 Generate e-Paper Clip

నెల్లూరు జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్16) నెల్లూరు నగరంలో ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటళ్ల దోపిడీ రోజురోజుకు భయంకర రూపం దాల్చుతోంది. వైద్యం అనే పవిత్ర వృత్తిని వ్యాపారంగా మార్చి,పేద ప్రజల జేబులకు చిల్లులు పెట్టే విధంగా అమానుషంగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒకసారి ఆసుపత్రి గడప దాటితే చాలు… పేషెంట్ కన్నా బిల్లు పెద్దదవుతోంది.డాక్టర్ చెప్పిందే వేదం అన్న నమ్మకంతో వచ్చే పేదవాడు చివరకు తన ఇల్లు, పొలం, బంగారం అమ్ముకునే పరిస్థితికి చేరుతున్నాడు. కానీ అదే సమయంలో ఈ దోపిడీపై సంపాదిస్తున్న డబ్బుతో కొంతమంది వైద్యులు కోట్లకు పడగలెత్తి, విలాసవంతమైన జీవితాలు గడుపుతూ ఏసీ కార్లలో తిరుగుతున్నారు.ఒక్కో బిల్లే షాక్ – పేదలకు మృతి శిక్ష సాధారణ చికిత్సకే లక్షల రూపాయల బిల్లులు వేస్తున్నారు. బెడ్ ఛార్జీలు, డాక్టర్ ఫీజులు, పరీక్షల ఖర్చులు అన్నీ కలిపి పేషెంట్ కుటుంబాన్ని అప్పుల బారిన పడేస్తున్నాయి. ముఖ్యంగా రూమ్ రెంట్ విషయంలో నెల్లూరులో జరుగుతున్న దోపిడీ మరింత ఆందోళన కలిగిస్తోంది.మహానగరమైన చెన్నైలోనే అత్యుత్తమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో రోజుకు రూ.2000కి గది దొరికితే, నెల్లూరులో మాత్రం కనీసం రూ.10,000 వసూలు చేయడం దారుణం కాదా?మందుల మాయ – MRP ఒకటి, వసూలు మరొకటి హాస్పిటల్‌లో డాక్టర్లు రాసే ప్రిస్క్రిప్షన్‌లో ఉన్న మందుల MRP ఒకటైతే, పేషెంట్‌కు ఇచ్చే ధర మరోటి. బయట ఫార్మసీలో కొనకుండా, ఆసుపత్రి ఇచ్చే మందులనే తప్పనిసరిగా కొనాలని ఒత్తిడి చేస్తున్నారు. దీంతో పేషెంట్‌కు అధిక ధరలు తప్పవు.ఇది కేవలం వ్యాపారం కాదు… ఇది నేరం. డ్రగ్ ఇన్స్పెక్టర్లు, సంబంధిత అధికారులు నిద్రలో ఉన్నారా? అనే అనుమానం ప్రజల్లో పెరుగుతోంది.ప్రభుత్వ ఆసుపత్రుల్లో లేనిది ఏమిటి?ప్రైవేట్ హాస్పిటళ్లలో ఉన్న సదుపాయాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో లేవా? ఉంటే ఎందుకు ప్రజలు అక్కడికి వెళ్లడం లేదు? లేక ప్రజలను ప్రైవేట్ వైపు మళ్లించేలా వ్యవస్థలో ఎక్కడో లోపం జరుగుతోందా?ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.అరికట్టే వారెవరు?ఈ మెడికల్ మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేయాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రజల ప్రాణాలతో ఆడుకుంటూ సంపాదిస్తున్న ఈ దోపిడీ దందాను వెంటనే నియంత్రించకపోతే పరిస్థితి మరింత దారుణంగా మారే ప్రమాదం ఉంది.ప్రభుత్వం వెంటనే ప్రత్యేక దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసి, ప్రైవేట్ హాస్పిటళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలి. ధరల నియంత్రణ, మందుల అమ్మకాలపై పర్యవేక్షణ, ఫీజులపై పరిమితులు విధించాలి.లేకపోతే… పేదవాడికి వైద్యం అందని కలగానే మిగిలిపోతుంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.