📄 ePaper
Epaper 2
Monday, September 14, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణKhammamజిల్లాలోగాడి తప్పిన పౌర సరఫరాల శాఖసమయం పాటించని డీలర్లు... పేదల అవస్థలు పట్టించుకోని  రెవెన్యూ పౌరసరఫరాల...

జిల్లాలోగాడి తప్పిన పౌర సరఫరాల శాఖ

సమయం పాటించని డీలర్లు… పేదల అవస్థలు

పట్టించుకోని  రెవెన్యూ పౌరసరఫరాల శాఖ అధికారులు

📰 Generate e-Paper Clip

జిల్లాలోగాడి తప్పిన పౌర సరఫరాల శాఖ

సమయం పాటించని డీలర్లు… పేదల అవస్థలు

పట్టించుకోని  రెవెన్యూ పౌరసరఫరాల శాఖ అధికారులు

ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి


ఖమ్మం జిల్లాలో ప్రజా పంపిణీ వ్యవస్థ గాడి తప్పిందని పేదలు ఆరోపిస్తున్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చౌక దుకాణాల ద్వారా రేషన్ బియ్యం అందించాల్సిన రేషన్ డీలర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ రేషన్ కార్డు కలిగిన పేదలను ఇబ్బందులు గురిచేస్తున్నట్లు ఆరోపణలు జిల్లా వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. అసలే  ఎండాకాలం రెక్కాడితే డొక్కాడని పేదలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే రేషన్ బియ్యం పై లక్షలాది కుటుంబాలు జిల్లాలో జీవనం కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో సివిల్ సప్లై రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం మూలంగా డీలర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు బియ్యం వినియోగదారులకు పంపిణీ చేయాల్సి ఉండగా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ తెగ కొర్రీలు పెడుతున్నట్లు సమాచారం అందుతోంది. పైగా కూలి నాలి పనులకు వెళ్లే పేదలకు సమయపాలన అంటూ లేకపోవడంతో డీలర్లు అందుబాటులో ఉండకపోవడంతో రేషన్ బియ్యం పొందేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించిన సమయం ప్రకారం పంపిణీ చేయాల్సి ఉండగా డీలర్లు ఆ దిశగా పంపిణీ వ్యవస్థను కొనసాగించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నప్పటికీ సంబంధిత రెవెన్యూ సివిల్ సప్లై అధికారులు పర్యవేక్షణ కొరవడంతో ప్రభుత్వ లక్ష్యం నీరు కారిపోతుందని రేషన్ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిసింది. ఇప్పటికైనా సంబంధిత సివిల్ సప్లై రెవెన్యూ అధికారులు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆయా మండలాలలోని గ్రామాలలోని చౌక దుకాణం డీలర్ల ద్వారా నిర్ణీత సమయం ప్రకారం రేషన్ కార్డులు కలిగిన పేదలకు సక్రమంగా బియ్యం అందే చర్యలు తీసుకోవాలని పలువురు రేషన్ కార్డు కలిగిన వినియోగదారులు జిల్లా ప్రజలు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.