📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriచౌదరిగుడలో ఘనంగా 135వ అంబేద్కర్ జయంతి వేడుకలు

చౌదరిగుడలో ఘనంగా 135వ అంబేద్కర్ జయంతి వేడుకలు

📰 Generate e-Paper Clip

ఘట్కేసర్ సర్కిల్ పోచారం డివిజన్ ఘట్కేసర్ మండల్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కేశపాగుల వినోద్ ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఘట్కేసర్ మండల్ అధ్యక్షుడు కర్ర రాజేష్ పోచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి చిత్రపటానికి పూలమాల సమర్పించి ఘన నివాళులు అర్పించారు అనంతరం కర్ర రాజేష్ మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో మహానుభావులలో ఒకరు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్. ఆయన కేవలం రాజ్యాంగ రచయిత మాత్రమే కాదు, సమానత్వం కోసం జీవితాంతం పోరాడిన గొప్ప సామాజిక సంస్కర్త. 1891 ఏప్రిల్ 14న జన్మించిన అంబేద్కర్ చిన్నప్పటి నుండి అనేక కష్టాలు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ, విద్యనే ఆయుధంగా తీసుకుని ప్రపంచ స్థాయి పండితుడిగా ఎదిగారు. ఆయన భారత రాజ్యాంగాన్ని రూపొందించి ప్రతి భారతీయుడికి సమాన హక్కులు కల్పించారు. “శిక్షణ పొందండి, సంఘటితంగా ఉండండి, పోరాడండి” అనే ఆయన సందేశం నేటికీ ప్రతి యువకుడికి మార్గదర్శకం. దళితులు, బలహీన వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన సేవలు అమూల్యమైనవి. సమాజంలో సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ అనే విలువలు నిలబడేందుకు ఆయన చేసిన కృషి చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఈ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యులు నర్సింగ్ ముదిరాజ్ భోజిరెడ్డి మంచాల సుధాకర్ ఎస్ సి పోచారం డివిజన్ అధ్యక్షుడు ఎర్ర రాజు మంద విజయ్, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.