📄 ePaper
Epaper 2
Monday, September 14, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriఘట్కేసర్ అంబేద్కర్ నగర్లో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలు

ఘట్కేసర్ అంబేద్కర్ నగర్లో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలు

📰 Generate e-Paper Clip

మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మున్సిపల్ పరిధిలోని ఘట్కేసర్ అంబేద్కర్ నగర్లో అంబేద్కర్ భవనం వద్ద డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. అంబేద్కర్ సంఘం సభ్యులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి, సందర్భంగా ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాల సంఘం అధ్యక్షుడు ఎజ్జల రఘు మాట్లాడుతూ భారత స్వాతంత్ర సమరయోధులు భారత రాజ్యాంగ నిర్మాత ఆర్థికవేత్త, దళిత బలహీన వర్గాల వికాసానికి పాటుపడిన మహానేత, అసమానతలు లేని సమాజం కోసం అనునిత్యం పరితపించి భారత రాజ్యాంగానికి ప్రాణం పోసిన అపర మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని ఆ మహనీయుని సేవలను కొనియాడారు. అనంతరం ప్రజలందరికీ అన్నవితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.