📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSiddipetగుండారం పాఠశాలలో మాక్ పార్లమెంట్ నిర్వహణ

గుండారం పాఠశాలలో మాక్ పార్లమెంట్ నిర్వహణ

📰 Generate e-Paper Clip

గుండారం పాఠశాలలో మాక్ పార్లమెంట్ నిర్వహణ

బెజ్జంకి, ఏప్రిల్ 8(ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గుండారం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల్లో ప్రజాస్వామ్యంపై అవగాహన పెంపొందించేందుకు మాక్ పార్లమెంట్ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి సర్పంచ్ తాళ్లపల్లి భీమయ్య ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను అభినందించారు. అతిథులుగా శ్రీరామ్ శ్రీనివాస్, నాగవేణి పాల్గొని చిన్నారులు తమ పాత్రలను అద్భుతంగా పోషించారని ప్రశంసించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులకు ఎలాంటి సమస్యలు ఉన్నా, సాధ్యమైనంత వరకు పరిష్కరించేందుకు సహకరిస్తానని హామీ ఇచ్చారు.అనంతరం నాగవేణి మాట్లాడుతూ విద్యార్థులు చక్కగా పార్లమెంట్ సభ్యుల పాత్రలు పోషించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉండ్రాళ్ల తిరుపతి, ఉపాధ్యాయులు జంగొని శ్రీనివాస్, రామంచ రవీందర్, శిరీష, హరీష, మాజీ ఎంపీటీసీ ఎలుక లతా దేవయ్య, వార్డు సభ్యులు ఎలుక శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.