📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSuryapetసైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన ఉండాలి చిలుకూరు ఎస్ఐ హనుమాన్ నాయక్

సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన ఉండాలి చిలుకూరు ఎస్ఐ హనుమాన్ నాయక్

📰 Generate e-Paper Clip

చిలుకూరు మార్చి 26(ప్రజావాణి): చిలుకూరు మండల కేంద్రంలో ఎస్పీ కె నరసింహ ఐపిఎస్ ఆదేశాల మేరకు చిలుకూరు ఎస్ఐ హనుమాన్ నాయక్ మండల కేంద్రం లోని జెర్రి పోతుల గూడెం గ్రామంలో  ట్రాఫిక్ రూల్స్, డ్రగ్స్, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలపైన, షీ టీమ్స్ పైన పోలీసు కళాభృందంతో విద్యార్థిని, విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. ఎస్ఐ హనుమాన్ నాయక్ మాట్లాడుతూ జిల్లా  ఎస్పీ కే నరసింహ ఐపిఎస్ అధ్వర్యంలో  సైబర్ నేరాలపై, రోడ్డు నియమ నిబంధనలపై చిలుకూరు మండల కేంద్రంలో జిల్లా  ఎస్పీ కే నరసింహ ఐపిఎస్ ఆదేశానుసారం  సైబర్ నేరాలపై, రోడ్డు నియమ నిబంధనలపై, గంజాయి మత్తు పదార్థాలపై, షీ టీమ్స్ పై పటిష్టంగా పనిచేస్తున్నమని తెలిపారు. ప్రతి స్కూల్ కాలేజీలలో చదువుకునే విద్యార్థులు ఇంటర్నెట్ ను సద్వినియోగం చేసుకోవాలి, సైబర్ మోసగాళ్ళ వల్ల మోసాలకు గురి కావద్దు, బ్యాంక్ ఖాతా, ఎటిఎం,కార్డ్ వివరాలు,ఓటిపి వివరాలు ఇతరులకు తెలపవద్దు, ఇతరులు ఆశ చూపితే వాటికి ఆకర్షితులు కావొద్దు.మెసేజ్ లలో వచ్చే బ్లూ లింక్ అనుసరించి వ్యక్తిగత వివరాలు నమోదు చేయవద్దు అని కోరినారు.సైబర్ మోసాలపై 1930 టోల్ ఫ్రీ నంబర్ కు పిర్యాదు చేయాలని అన్నారు. అలాగే వేధింపులపై 100 కు సమాచారం ఇవ్వాలని తెలిపినారు.ఎవరైనా ఆకతాయిలు ఆడపిల్లలను, మహిళలను వేధింపులకు గురి చేస్తే సూర్యాపేట షీ టీం ఫోన్ నెంబర్ 8712686056 కి సమాచారం ఇవ్వండి. విద్యార్థులు అందరూ క్రమశిక్షణ కలిగి, తల్లిదండ్రులను గురువులను గౌరవించి, ఉన్నత విద్యను అభ్యసించి మీ యొక్క లక్ష్యాలను చేరుకోవాలని తెలిపినారు. ఆకతాయిలు ఎవరైనా అల్లరి పెట్టినట్లయితే వేధించినట్లయితే   షీ టీం కి సమాచారం ఇవ్వండి.మీయొక్క వివరాలు గోప్యంగా ఉంచబడతాయి అని తెలిపారు.యువత చెడు వ్యసనాల బారిన పడొద్దు అన్నారు.ట్రాఫిక్ నిబంధనలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.అనంతరం పోలీసు  కళబృందం వారు చక్కటి సాంస్కృతిక, పాటలతో గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లలిత, ఉప సర్పంచ్ దుర్గ,మహిళా కానిస్టేబుల్ గౌతమి, కానిస్టేబుల్ సలీమ్, నగేష్,హోం గార్డ్ గాంధీ,సతీష్ పోలీస్ కళా బృందం ఇంచార్జి యల్లయ్య,సభ్యులు గోపయ్య,  సత్యం,చారి,కృష్ణ,నాగార్జున, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.