📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్వై .ఎస్.ఆర్ కడప జిల్లా.లో పదవ తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు ...

వై .ఎస్.ఆర్ కడప జిల్లా.లో పదవ తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్

📰 Generate e-Paper Clip

ప్రజావాణిన్యూస్(మార్చి15)కడప జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపియస్ గారు పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు.పరీక్షా కేంద్రాల వద్ద ఇన్విజిలేటర్లు మరియు పరీక్షకు కేటాయించిన సిబ్బంది తప్ప ఇతర సిబ్బంది గానీ,వ్యక్తులు గానీ ఉండరాదు.ఈ నెల 16 నుంచి ఏప్రిల్1వరకు ప్రతీ రోజు ఉదయం9.30 నుండి మధ్యాహ్నం12.45 గంటల వరకు నిర్వహించనున్న పదవ తరగతి పరీక్షలు సజావుగా జరిగేలా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు వై.ఎస్.ఆర్ కడప జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపియస్ గారు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.పరీక్షల సమయంలో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖ తరుపున అన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామన్నారు.పరీక్షా పత్రాలు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ ల వద్ద సిబ్బంది తో పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని, పరీక్ష పేపర్లు కేంద్రాలకు తీసుకొచ్చేటప్పుడు,సమాధాన పత్రాలు తీసుకెళ్లేటప్పుడు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని,పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉన్నందున పరీక్షా కేంద్రాలు ఆవరణలో బయట వ్యక్తులు లేకుండా చర్యలు తీసుకున్నామని,పరీక్షా కేంద్రాల సమీపంలోని అన్ని జిరాక్స్‌ సెంటర్లను మూసివేయిస్తున్నామని తెలిపారు.జిల్లా వ్యాప్తంగా ఉన్న కేంద్రాలలో అవసరమైన వరకు బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలని,ఎలాంటి అవకతవకలు,మాల్ ప్రాక్టీసుకు అవకాశం లేకుండా పకడ్బందీగా విధులు నిర్వర్తించాలని పోలీస్ అధికారులకు ఎస్పీ గారు ఆదేశించారు.పరీక్షలను సజావుగా ప్రశాంత వాతావరణం లో నిర్వహించేందుకు ఇతర శాఖల సమన్వయంతో పటిష్టమైన ఏర్పాట్లు చేసామని,పరీక్షా సమయంలో ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టామని తెలిపారు.విద్యార్థులు పరీక్షా కేంద్రానికి సమయానికి హాజరు కావాలని,కావున విద్యార్థులు,వారి తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి సరైన సమయంలో పరీక్షా కేంద్రానికి చేరుకునేలా చూడాలని సూచించారు.పరీక్షా విద్యార్థులతో పాటు పరీక్ష విధులు నిర్వహించే అన్ని శాఖల సిబ్బంది పదవ తరగతి పరీక్షల నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని,పరీక్షా కేంద్రాల వద్ద ఇన్విజిలేటర్లు,పరీక్షలకు కేటాయించిన సిబ్బంది తప్ప ఇతర సిబ్బంది లేదా వ్యక్తులు గానీ ఉండరాదని తెలిపారు.మాస్ కాపీయింగ్,మాల్ ప్రాక్టీస్‌కు విద్యార్థులు ఎవరైనా పాల్పడినా,లేదా వారికి ఎవరైనా సహకరించినా,వారి పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.జిల్లావ్యాప్తంగా ఏ పరీక్షా కేంద్రం వద్ద అయినా ఎటువంటి చిన్న ఘటన జరిగినా వెంటనే డయల్ 112 కు సమాచారం అందించాలని జిల్లా ప్రజలకు ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారు తెలియచేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.