📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్పెండింగ్ లో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి పూర్తికి ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని నిధులు విడుదల...

పెండింగ్ లో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి పూర్తికి ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని నిధులు విడుదల చేయాలి సిపిఎం

📰 Generate e-Paper Clip

ప్రజావాణిన్యూస్(మార్చి15)కడప పెండింగ్ లో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి పూర్తికి ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని నిధులు విడుదల చేయాలి.లేకపోతే ప్రజలతో కలిసి పోరాటం తీవ్రతరం చేస్తాం.సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కే ప్రభాకర్ రెడ్డి హెచ్చరిక.రాష్ట్ర ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని కడప నగరంలో పెండింగ్ లో ఉన్న విశ్వనాధపురం రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసేందుకు తక్షణమే నిధులు విడుదల చేయాలని, లేని పక్షంలో పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె.ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు.ఆదివారం నాడు కడప నగరంలోని విశ్వనాధపురం వద్ద ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి పెండింగ్లో ఉన్న నిర్మాణాన్ని పార్టీ నేతలు,ప్రజలతో కలిసి ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కడప కమలాపురం నియోజకవర్గ ప్రజలు పడుతున్న ఇబ్బందులను సీఎం దృష్టికి తీసుకెళ్తామని ఆయన తెలియజేశారు.కడప నగరం నుండి విశ్వనాధపురం వైపు దాదాపు 35 గ్రామాల ప్రజలు నిత్యం ఈ రహదారిలో వెళ్తుంటారని వారందరూ ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని ఆయన తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం దగ్గర మూడున్నర కోట్లు నిధులు లేకపోవడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు.కడప జిల్లా అభివృద్ధి కోసం నిరంతరం ప్రయత్నం చేస్తామని ముఖ్యమంత్రి చెబుతున్న మాటల్లో స్పష్టత ఉండడం లేదన్నారు.మాటలు కోటలు దాటుతున్నా ఆచరణ గడప దాటడం లేదని ఆయన తీవ్రంగా విమర్శించారు.ఇప్పటికైనా ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని రైల్వే అండర్ బ్రిడ్జి పెండింగ్ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు నిధులు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.లేనిపక్షంలో ప్రజానీకాన్నీ కలుపుకొని రానున్న కాలంలో పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.కడప కమలాపురం ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ సమస్య పరిష్కారం కోసం నిధులు రాబట్టాలని వారికి సూచించారు.ఈ పర్యటనలో సిపిఎం నగర కార్యదర్శి రామమోహన్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మనోహర్,నాయకులు దస్తగిరిరెడ్డి, రామకృష్ణారెడ్డి,కుమారస్వామిరెడ్డి,నరసింహ,తిమ్మయ్య,చంద్రారెడ్డి,రాజారెడ్డి,రామచంద్రారెడ్డి,సుబ్బమ్మ, గోపాల కృష్ణయ్య,రాజమణి,శివకుమార్,విజయ్ తదితరులు పాల్గొన్నారు.లేకపోతే ప్రజలతో కలిసి పోరాటం తీవ్రతరం చేస్తాం.సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కే ప్రభాకర్ రెడ్డి హెచ్చరిక.రాష్ట్ర ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని కడప నగరంలో పెండింగ్ లో ఉన్న విశ్వనాధపురం రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసేందుకు తక్షణమే నిధులు విడుదల చేయాలని,లేని పక్షంలో పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె.ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు.ఆదివారం నాడు కడప నగరంలోని విశ్వనాధపురం వద్ద ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి పెండింగ్లో ఉన్న నిర్మాణాన్ని పార్టీ నేతలు,ప్రజలతో కలిసి ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కడప కమలాపురం నియోజకవర్గ ప్రజలు పడుతున్న ఇబ్బందులను సీఎం దృష్టికి తీసుకెళ్తామని ఆయన తెలియజేశారు.

కడప నగరం నుండి విశ్వనాధపురం వైపు దాదాపు 35 గ్రామాల ప్రజలు నిత్యం ఈ రహదారిలో వెళ్తుంటారని వారందరూ ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని ఆయన తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం దగ్గర మూడున్నర కోట్లు నిధులు లేకపోవడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు.కడప జిల్లా అభివృద్ధి కోసం నిరంతరం ప్రయత్నం చేస్తామని ముఖ్యమంత్రి చెబుతున్న మాటల్లో స్పష్టత ఉండడం లేదన్నారు.మాటలు కోటలు దాటుతున్నా ఆచరణ గడప దాటడం లేదని ఆయన తీవ్రంగా విమర్శించారు.ఇప్పటికైనా ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని రైల్వే అండర్ బ్రిడ్జి పెండింగ్ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు నిధులు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.లేనిపక్షంలో ప్రజానీకాన్నీ కలుపుకొని రానున్న కాలంలో పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.కడప కమలాపురం ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ సమస్య పరిష్కారం కోసం నిధులు రాబట్టాలని వారికి సూచించారు.ఈ పర్యటనలో సిపిఎం నగర కార్యదర్శి రామమోహన్,జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మనోహర్,నాయకులు దస్తగిరిరెడ్డి, రామకృష్ణారెడ్డి,కుమారస్వామిరెడ్డి,నరసింహ,తిమ్మయ్య,చంద్రారెడ్డి,రాజారెడ్డి,రామచంద్రారెడ్డి, సుబ్బమ్మ,గోపాల కృష్ణయ్య,రాజమణి,శివకుమార్,రవి,విజయ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.