📄 ePaper
Epaper 2
Sunday, September 13, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్రాజకీయ కక్షతోనే జడ్పిటిసి చిన్న పోల్ రెడ్డిపై అక్రమ కేసులు: ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి

రాజకీయ కక్షతోనే జడ్పిటిసి చిన్న పోల్ రెడ్డిపై అక్రమ కేసులు: ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి

📰 Generate e-Paper Clip

ప్రజావాణి న్యూస్:(మార్చి 10) బద్వేల్ సబ్ జైలులో రిమాండ్‌లో ఉన్న జడ్పిటిసి వంకల చిన్న పోల్ రెడ్డిని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై రాజకీయ కక్ష సాధింపు చర్యలు మితిమీరిపోయాయని ఆక్షేపించారు. ఒక కేసు తర్వాత మరో కేసు నమోదు చేస్తూ పార్టీ నాయకులను మానసిక ఇబ్బందులకు గురిచేయడం ప్రజాస్వామ్యానికే విరుద్ధమని అన్నారు.ఎన్నికలకు ముందు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ “రెడ్ బుక్”లో పేర్లు నమోదు చేసుకున్నామని చెప్పినట్లుగా, ఇప్పుడు అదే విధానాన్ని అమలు చేస్తూ ముఖ్యమంత్రి, లోకేష్ రాజకీయ కక్షతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. బద్వేల్ నియోజకవర్గంలో స్థానిక కూటమి నాయకుల ప్రోత్సాహంతోనే తప్పుడు కేసులు బనాయిస్తున్నారని, రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నాయకులను బలహీనపరచాలనేది వారి కుట్ర అని ఆరోపించారు.జడ్పిటిసి చిన్న పోల్ రెడ్డిపై నమోదైన కేసుపై స్పందిస్తూ 2011లో జరిగిన సొసైటీ వ్యవహారంపై అప్పట్లోనే విచారణలు పూర్తయి, డబ్బులు కూడా తిరిగి చెల్లించినప్పటికీ, దాదాపు 14 ఏళ్ల తర్వాత అదే అంశాన్ని మళ్లీ తెరపైకి తీసుకురావడం అన్యాయమన్నారు. గత మూడు ప్రభుత్వాల కాలంలో లేని ఈ కేసును ఇప్పుడు రాజకీయ దురుద్దేశంతోనే తిరగదోడారని మండిపడ్డారు.ఒక ప్రజాప్రతినిధికి కనీసం నోటీసు ఇవ్వకుండా నేరుగా అరెస్టు చేయడాన్ని వైఎస్ఆర్సీపీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. కూటమి నాయకుల అక్రమాలను ప్రజలు గమనిస్తున్నారని, భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి అన్యాయాలకు పాల్పడిన వారిపై కచ్చితంగా చట్టపరమైన చర్యలు ఉంటాయని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మాటలను గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు మల్లేశ్వర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు వంకల పెద్ద పోలిరెడ్డి, యద్ధారెడ్డి, పుత్తా శ్రీరాములు, బిజివేముల రామసుబ్బారెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, రమణారెడ్డి, రమేష్ బాబు, వెంకటసుబ్బారెడ్డి, చెన్న కృష్ణారెడ్డి, కేశవరెడ్డి, వీరారెడ్డి, జయరాం రెడ్డి, ఓబుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.