📄 ePaper
Epaper 2
Sunday, September 13, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్మైదుకూరు పట్టణ పరిధిలోని జగనన్న కాలనీలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్..డి.ఎస్.పీ శ్రీ జి.రాజేంద్ర ప్రసాద్

మైదుకూరు పట్టణ పరిధిలోని జగనన్న కాలనీలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్..డి.ఎస్.పీ శ్రీ జి.రాజేంద్ర ప్రసాద్

📰 Generate e-Paper Clip

ప్రజావాణి న్యూస్: (మార్చి 07)  వై.ఎస్.ఆర్ కడపజిల్లా ఎస్.పి శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారి ఆదేశాలతో మైదుకూరు పట్టణ పరిధిలోని జగనన్న కాలనీలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్..తనిఖీల్లో సరైన రికార్డులు లేని 5 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు స్వాధీనం  రౌడీ షీటర్లు, ట్రబుల్ మాంగర్లకు కౌన్సిలింగ్ అనుమానితులు, పాత నేరస్థుల ఇళ్లలో తనిఖీలు…చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసుల హెచ్చరిక జిల్లా ఎస్.పి శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారి ఆదేశాల మేరకు శనివారం తెల్లవారుఝామున జిల్లాలోని మైదుకూరు అర్బన్ పి.ఎస్ పరిధిలోని జగనన్న కాలనిలో ‘ఆపరేషన్ వజ్రప్రహార్’ లో భాగంగా మైదుకూరు డి.ఎస్.పీ శ్రీ జి.రాజేంద్ర ప్రసాద్ పర్యవేక్షణలో కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. పాత నేరస్తులు మరియు అనుమానితుల ఇళ్లలో, అనుమానిత ప్రాంతాల్లో వేటకొడవళ్లు, బాంబులు మరియు నిషేధిత ఆయుధాల కొరకు అణువణువూ క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. వాహనాల రికార్డులను పరిశీలించారు.

సరైన రికార్డులు లేని 5 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు.రౌడీ షీటర్లు, ట్రబుల్ మాంగర్లకు, సస్పెక్ట్ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామస్థులు ఎవరూ ఎలాంటి గొడవలకు పాల్పడకుండా మీరు మీ పనులు చేసుకుంటూ ఆర్ధికంగా ఎదిగి పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించి లేదా అనుమానితుల సమాచారాన్ని డయల్ 112 ద్వారా పోలీస్ శాఖకు సమాచారమివ్వాలని సూచించారు.కార్డన్ అండ్ సర్చ్ తనిఖీల్లో మైదుకూరు సబ్ డివిజన్ లోని సి.ఐ లు, ఎస్.ఐలు , సిబ్బంది పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.