📄 ePaper
Epaper 2
Monday, September 14, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన శాసన సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ

మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన శాసన సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ

📰 Generate e-Paper Clip

ప్రజావాణిన్యూస్: (మార్చి08) సత్తెనపల్లి రూరల్ మండలం నందిగామ గ్రామంలో మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన. సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారుమరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి విజన్ మేరకు ప్రభుత్వం ప్రారంభించిన  కార్యక్రమం ఎంతో ముఖ్యమైన కార్యక్రమం. సమాజంలోని సామర్థ్యవంతులు ముందుకు వచ్చి పేద కుటుంబాలను ఆదుకోవాలని లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది.ఈ రోజు నందిగామ గ్రామంలో P4 కార్యక్రమం కింద నిర్వహిస్తున్న ఈ ఉచిత వైద్య శిబిరం చాలా సంతోషకరమైన విషయం. ఈ కార్యక్రమంలో భాగంగా మార్గదర్శి డాక్టర్ కోలా ప్రవీణ్ గారు, పలకలూరు లోని ప్రవీణ్ హాస్పిటల్ ద్వారా నందిగామ గ్రామంలోని 25 బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవడం అభినందనీయమైన విషయం.ఈ వైద్య శిబిరంలో గ్రామ ప్రజలకు ఉచితంగా అన్ని రకాల వైద్య పరీక్షలు మరియు మందులు అందించడం ఎంతో గొప్ప సేవ. అంతేకాకుండా భవిష్యత్తులో ప్రవీణ్ హాస్పిటల్‌కు వెళ్లే రోగులకు జీరో ఓపీ (OP) సౌకర్యం మరియు ల్యాబ్ పరీక్షలు, మందులపై 40 నుండి 50 శాతం వరకు తగ్గింపు ఇవ్వడం గ్రామ ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది.ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజంలో ఒక మంచి మార్పును తీసుకువస్తాయి. P4 కార్యక్రమం ద్వారా పేద కుటుంబాలు అభివృద్ధి చెందడానికి మంచి అవకాశాలు ఏర్పడుతున్నాయి.ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న డాక్టర్ కోలా ప్రవీణ్ గారికి మరియు ప్రవీణ్ హాస్పిటల్ వైద్య బృందానికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.ఈ కార్యక్రమం లో వివిధ హోదాలో వున్నా రాష్ట్ర జిల్లా నియోజకవర్గ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.