📄 ePaper
Epaper 2
Tuesday, September 29, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని చిన్నారి కీర్తనకు ప్రాణ బిక్ష పెట్టండి..లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయకపోతే కీర్తన...

ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని చిన్నారి కీర్తనకు ప్రాణ బిక్ష పెట్టండి..లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయకపోతే కీర్తన బ్రతకదని డాక్టర్స్ వెల్లడి

📰 Generate e-Paper Clip

పల్నాడుజిల్లా ప్రజావాణిన్యూస్(మార్చి26) వినుకొండ మండలం పెద్ద కంచర్ల యం పి పి పాఠశాల లో 4వ తరగతి చదువుతున్న కీర్తనఈ చిట్టీ తల్లికి కష్టం వచ్చింది ప్రభుత్వ పెద్దలు దాతలు సహాయ సహకారాలు అందిస్తే కానీ ఆ చిన్నారికి వచ్చిన కష్టం తీరదు. అల్లారు ముద్దుగా ఆడుతూ పాడుతూ చదువుకునే పసి వయస్సులో పాపం ఆ చిన్నారి దవాఖానా లకు తిరుగుతుంది. కామెర్లే కదాని వినుకొండ వైద్యాశాలకు వెళ్తే పెద్ద డాక్టర్ లకు చూపించమనివినుకొండ స్థానిక వైద్యులు తెలుపడంతో రెక్కా డితే కానీ డొక్కాడని ఆ పసి బిడ్డ తల్లితండ్రులకు గుండెల్లో పిడుగు పడినంత పనైంది. వివరాలు పరిశీలిస్తే పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం పమిడిపాడు గ్రామానికి చెందిన పల్లపాటి వీరయ్య మరియకుమారి దంపతులు కూలి పనులు చేసుకుని పిల్లలను పోషిస్తూ ప్రభుత్వ పాఠశాల లో చదివిస్తున్నారు వీరికి ముగ్గురు పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఒక మగ పిల్లవాడు కీర్తన (9) నాల్గవ తరగతి, జోష్ణ (8) 3వ తరగతి, లక్కీ (6) ఒకటవ తరగతి వీరయ్య మరియకుమారి దంపతులు వినుకొండ మండలం పెద్ద కంచర్ల గ్రామంలో నివసిస్తు వీరి పిల్లలను అదే గ్రామంలో పెద్ద కంచర్ల యం పి పి స్కూల్ ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నారు. మూడు నెలల క్రితం వీరి పెద్ద పాప కీర్తన అనారోగ్య సమస్య తో స్కూల్ కు వెళ్లలేని పరిస్థితి ఎదురైంది తల్లిదండ్రులు వినుకొండ లోని ఓ వైద్య శాలలో వైద్యం చేపించారు వైద్యులు మెరుగైన వైద్యం కోసం పల్నాడు జిల్లా కేంద్రం లోని వైద్య శాలకు తీసుకువెళ్లి వైద్యం చేపించు కోవాలని చూచించడంతో నర్సరావుపేట లైఫ్ లైన్ హాస్పిటల్ లో పాపను చేర్పించారు అక్కడి వైద్యులు కూడ మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తీసుకువెళ్లాలని చూచించడంతో కీర్తనను గ్లోబల్ హాస్పిటల్ హైదరాబాద్ లో చేర్పించారు. వైద్యులు పాప లివర్ పాడయింది సర్జరీ చేసి ట్రాన్స్ ప్లాంట్ చేయాలని తెలిపారు తల్లిదండ్రులు తమ లివర్ లో కొంత భాగం కూతురు కీర్తన కు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు కానీ ఆపరేషన్ కు 19 లక్షల 50వేలు అవుతుందని డాక్టర్ లు తెలియజేయడం తో ఎటు పాలుపోని పరిస్థితుల్లో తల్లి దండ్రులు కన్నీరు పెడుతున్నారు. కీర్తన తల్లి మరియకుమారి మాట్లాడుతూ తన కూతురు కీర్తనకు ప్రాణ బిక్ష పెట్టాలని వేడుకుంటున్నారు. తాము కూలి పనులు చేసుకుని బ్రతికే వారమని పిల్లలను పోషించు కోవడమే కష్టం గా ఉంటుందని పేద స్థితిలో ఉన్న తమకు పెద్ద కష్టం వచ్చిందని కీర్తన వైద్యం కోసం ఇప్పటికే మూడు లక్ష లు అప్పు చేసి ఖర్చు చేశామని తెలిపారు. ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఉప ముఖ్య మంత్రి పవణ్ కళ్యాణ్ వినుకొండ ఎమ్మెల్యే జీ వీ ఆంజనేయులు స్పందించి తమ బిడ్డ కు ప్రాణ బిక్ష పెట్టాలని కీర్తన తల్లి మరియకుమారి కోరుతున్నారు. దాతలు సహాయం కూడ అవసరం అవుతుందని తమకు సహాయం చేయాలని తమ ఫోన్ పే వివరాలు తెలిపారు పల్ల పాటి వీరయ్య 8309816077 పల్ల పాటి మరియకుమారి 9542160961 నెంబర్లకు సహాయం పంపి తమ కుటుంబానికి పెద్ద కూతురు కీర్తనకు ప్రాణ బిక్ష పెట్టాలని వీరయ్య మరియకుమారి దంపతులు కోరుతున్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.