📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్పేద విద్యార్థుల పై గరికపాటి మాటలను వెనక్కి తీసుకోవాలి''సిపిఎం

పేద విద్యార్థుల పై గరికపాటి మాటలను వెనక్కి తీసుకోవాలి”సిపిఎం

📰 Generate e-Paper Clip

ప్రజావాణిన్యూస్(మార్చి22)పోరుమామిళ్ల స్థానిక సిపిఎం పార్టీ ఆఫీసులో సమావేశం సందర్భంగా గరికపాటి నరసింహా రావుగారు,పేద విద్యార్థులకు స్కూల్లలో మధ్యాహ్న భోజనము ఎత్తివేయాలని మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలని సిపిఎం పార్టీగా సిఐటియు,ఐద్వాసంఘంగా  సమావేశం పెట్టడం జరిగింది,ఈ సందర్భంగా సిపిఎం పోరుమామిళ్ల మండల కార్యదర్శి యన్ భైరవప్రసాద్,ఐద్వా సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు షేక్ గౌసియా బేగం సిఐటియు నాయకులు సగిలిప్రకాష్ వారు సంయుక్తంగా మాట్లాడుతూ.గరికపాటి ప్రవచనాలు చెప్పుకుంటూ ప్రఖ్యాతి గాంచిన గరికపాటి ప్రవచనాలు చెప్పుకుంటూ ఎంతో పేరు తెచ్చుకున్నటువంటి సమాజంలో గౌరవం ప్రఖ్యాతిగాంచినటువంటి గొప్పవారైనా గరికపాటి ఈరోజు ప్రభుత్వాస్కూల్ లో చదువుకుంటున్న పేద పిల్లలకు ఎందుకు భోజనం పెట్టడం అనేమాటలు విషంకక్కడంగాను,చాలా దుర్మాగంగా ఉందని,వారు ఆవేదన వ్యక్తపరిచారు గరికపాటి అంటరాని పేదపిల్లలు,క్రిందికులాల పిల్లలు చదువు కోవడం పైనే ద్వేషంగాఉందని,పేద పిల్లలు చదువు కుంటే, దేవుడు,దయ్యం అనేవి నమ్మరనీ, అపబద్రత భావం వాస్తవం ఉందని,చదువు ద్వారా అతని లాంటి వారి జీవనోఉపాధివారికి దెబ్బతింటున్నామనే భయం స్పష్టంగా కనపడుతుందిఅనీ పిల్లలు భోజనం తెచ్చుకోకపోతే స్కూల్ మానేయమని అహంకారపూరీతంగా మాట్లాడటం బాధాకరమనీ గరికపాటి గారు నిజమైన అభ్యుదయవాది అయితే,భోజనం కోసం విద్యార్థీనీవిద్యార్థులుస్కూల్ కి రావాల్సిన దుస్తుతి పైన ప్రభుత్వూలను నిలదీయాలివారు అన్నారు,గరికపాటి ప్రవచనాలను ద్వారా ఆర్థికంగా పెద్ద ఎత్తున బలపడడం రాష్ట్ర ప్రజలందరికీ మేధావులకు అందరికీ తెలుసు కనుక డబ్బు బలం అన్ని ఉన్నటువంటి గరికపాటి పేద బలహీన వర్గాల నిరుపేద కుటుంబీకులైనటువంటి ప్రజల బిడ్డలను స్కూల్లో చదువుకోవడము వారికి ప్రభుత్వము భోజనం పెట్టడం అనేది తప్పు అనడం వారు ఏమన్నా పెళ్ళికొడుకుల అనడం ఆ మాటలు వెంటనే గరికపాటి వెనక్కి తీసుకోవాలని వారన్నారు ఈ మాటల పైన మేధావులు, అభ్యుదయవాదులు గళం విప్పాలన్నారు, మేధావి గొప్పవారైనటువంటి గరికపాటి వారు వెంటనే విద్యార్థుల పైన మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకోవాలని, పేద ప్రజల బిడ్డలైన విద్యార్థిని విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని, ఇలాంటి మాటలు రాకుండా గరికపాటి జాగ్రత్తగా మాటలు మాట్లాడేటప్పుడు చాలా భద్రంగా సమస్యలు రాకుండాచూసుకోవాలని వారు అన్నారు లేనిపక్షమైతే పేద విద్యార్థులందరూ పెద్ద ఎత్తున గరికపాటి పైన నిరసన కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా చేస్తామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం సిఐటియు ఐద్వాసంఘుం నాయకులు నాయకురాలు ప్రకాష్, రవి ,ఆలీ భాష, అన్నం గోవిందు, ఐద్వా సంఘం నాయకురాలు బీబి, మేరీ, ఓబులమ్మ తదితరులు పాల్గొన్నారు అభినందనలతో.యన్ భైరవ ప్రసాద్ సిపిఎం పోరుమామిళ్ల మండల కార్యదర్శి

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.