📄 ePaper
Epaper 2
Monday, September 14, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్నూతన రామాలయం నిర్మిద్దాం ''కొండిశెట్టి వెంకటరమణయ్య

నూతన రామాలయం నిర్మిద్దాం ”కొండిశెట్టి వెంకటరమణయ్య

📰 Generate e-Paper Clip

ప్రజావాణిన్యూస్(మార్చి27)సి ఎస్ పురం ఎస్సీ కాలనీలో నూతన రామాలయ నిర్మాణమునకు బిజెపి సారథ్యంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరఫున సంపూర్ణ సహకారం ఉంటుందని బిజెపి జిల్లా ప్రశిక్షణ మహాభియాన్ కోకన్వీనర్ మరియు జిల్లా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కో కన్వీనర్ కొండిశెట్టి వెంకట రమణయ్య అన్నారు మండల కేంద్రంలోని సి ఎస్ పురం ఎస్సీ కాలనీలో శుక్రవారం శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం భక్తులు విభిన్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు.40 సంవత్సరాల క్రితం రామాలయం నిర్మాణం కోసం కేటాయించిన స్థలంలో తిరిగి ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపేందుకు అరుగును ఏర్పాటు చేసి భక్తిపూర్వకంగా శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామి చిత్రపటాలతో ప్రత్యేక పూజలు చేశారు.పూజ అనంతరం స్థానికులకు వడపప్పు -పానకం తీర్థప్రసాదాలు పంపిణీ చేయగా,వాతావరణమంతా ఆధ్యాత్మికతతో నిండిపోయింది.రామాలయ నిర్మాణం పట్ల ప్రజల్లో కనిపించిన ఉత్సాహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ సందర్భంగా కొండిశెట్టి వెంకటరమణయ్య హాజరై ముందు దీపజ్యోతి ప్రజ్వలించి పూజల్లో పాల్గొన్నారు.అనంతరం ఆయన మాట్లాడుతూఎస్సీ కాలనీలో రామాలయ నిర్మాణం కోసం బీజేపీ పార్టీ తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం.ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఆధ్యాత్మికంగా సామాజికంగా ఉపయోగపడే ధార్మిక నిర్మాణాలకు ప్రాధాన్యమిస్తున్నది.త్వరలో ఈ ఆలయ నిర్మాణ అవసరమైన మద్దతు అందేలా కృషి చేస్తామన్నారు ఈ సందర్భంగా కాలనీ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ మండల టిడిపి అధ్యక్షులు గ్రంధి హేమ సుందరం,బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకట సత్యం,మండల బిజెపి అధ్యక్షులు పాశం రామకృష్ణ,పెనుమాల నారమ్మ,సంగిశెట్టి పీరయ్య లక్ష్మీరెడ్డి,శ్రీనివాసులు రెడ్డి,జాజం చిన్న సుబ్బయ్య,దమ్ము మాలకొండయ్య, దమ్ము ఏమయ్యా, మాదినేని రామయ్య,రెబ్బ సౌడయ్య, దెబ్బ నారాయణ, దుర్గ ప్రసాద్, ఆ ప్రాంత ఎస్సీ కాలనీవాసులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.