📄 ePaper
Epaper 2
Tuesday, September 29, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSiddipetదౌల్తాబాద్ మండలం శేరిపల్లి బంధారం గ్రామంలోని మహాత్మ జ్యోతి భూ పూలే బిసి బాలికల గురుకుల...

దౌల్తాబాద్ మండలం శేరిపల్లి బంధారం గ్రామంలోని మహాత్మ జ్యోతి భూ పూలే బిసి బాలికల గురుకుల పాఠశాల జూనియర్ కళాశాలను జిల్లా కలెక్టర్ కె హైమావతి ఆకస్మిక తనకి..

📰 Generate e-Paper Clip

దౌల్తాబాద్ మండలం శేరిపల్లి బంధారం గ్రామంలోని మహాత్మ జ్యోతి భూ పూలే బిసి బాలికల గురుకుల పాఠశాల జూనియర్ కళాశాలను జిల్లా కలెక్టర్ కె హైమావతి ఆకస్మిక తనకి..

సిద్ధిపేట, మార్చి 26, ప్రజావాణి

దౌల్తాబాద్ మండలం శేరిపల్లి బంధారం గ్రామంలోని మహాత్మ జ్యోతి భూ పూలే బిసి బాలికల గురుకుల పాఠశాల జూనియర్ కళాశాలను జిల్లా కలెక్టర్ కె హైమావతి ఆకస్మికంగా సందర్శించి మధ్యాహ్న భోజన ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.అన్నం, బెండకాయ కూర, పాలకూర పప్పు, రసం, నెయ్యి, పెరుగు లను పరిశీలించారు. పాలకూర పప్పు మరి ఇంత పలచగా ఉంటుందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ఇంట్లో ఇలాగే వండుతారా అని వంట సిబ్బంది పైన మండిపడ్డారు. కూరలో నాణ్యత లోపిస్తే సహించేది లేదని హెచ్చరించారు. వంట గది, డైనింగ్ హాల్ ఎల్లపుడు శుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు.గురుకుల ప్రాంగణం కలియ తిరిగారు. విద్యార్థులకు మరుగుదొడ్లు మైదానంలో ఉన్నాయని రాత్రి వేళల్లో భయపడుతున్నారని వసతి గృహంలో మరుగుదొడ్లు ఏర్పాటు చేయాల్సిందిగా ప్రిన్సిపల్ కలెక్టర్ కి తెలపగా సానుకూలంగా స్పందించి ఈడబ్ల్యూఐడిసి అధికారులు వచ్చి దానికి సంబంధించిన ఎస్టిమేట్ వేస్తారని తప్పనిసరిగా నిర్మించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.విద్యార్థుల క్రమశిక్షణ అలవాట్లు, ప్రవర్తన నియమావళి ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు మానిటర్ చెయ్యాలని చదువు, భోజనం, వసతి విషయం లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయులను ఆదేశించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.