📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్ట్యాక్స్ కలెక్షన్ మరియు అభివృద్ధి పనులపై సిబ్బందితో సమీక్ష సమావేశం,మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ శ్రీ ఏ....

ట్యాక్స్ కలెక్షన్ మరియు అభివృద్ధి పనులపై సిబ్బందితో సమీక్ష సమావేశం,మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ శ్రీ ఏ. చంద్రమోహన్

📰 Generate e-Paper Clip

ప్రజావాణిన్యూస్(మార్చి20) బద్వేల్ రెవిన్యూ డివిజనల్ అధికారి వారి కార్యాలయంలో బద్వేల్ మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ శ్రీ ఏ.చంద్రమోహన్ గారు మున్సిపాలిటీలో జరుగుతున్న ట్యాక్స్ కలెక్షన్ మరియు అభివృద్ధి పనులపై సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన ట్యాక్స్ వసూళ్ల పురోగతిని సమీక్షిస్తూ,పెండింగ్ బకాయిల వసూళ్లను వేగవంతం చేయాలని అధికారులను సూచించారు.మార్చి 30 లోపు పన్ను చెల్లించినట్లయితే వడ్డీలో 50% రాయితీ పొందవచ్చునని,ఈ అవకాశాన్ని బకాయిదారులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.అలాగే సిబ్బంది తమ పరిధిలో 100% పన్నులు వసూలు చేయాలని స్పష్టం చేస్తూ,లక్ష్యాలు సాధించకపోతే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అలాగే మున్సిపాలిటీలో కొనసాగుతున్నఅభివృద్ధి పనులు,శానిటేషన్,డ్రైనేజ్,తాగునీటి సరఫరా,లైటింగ్ వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ శ్రీ నరసింహారెడ్డి గారు, డీఈఈ సుమన్ రెడ్డి గారు,రెవెన్యూ ఆఫీసర్ గంగిరెడ్డి గారు,మేనేజర్ హరినాథ్ గారు,రెవెన్యూ ఇన్స్పెక్టర్లు మరియు అడ్మిన్ సెక్రటరీలు పాల్గొన్నారు.పురపాలక కార్యాలయం,బద్వేల్

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.