📄 ePaper
Epaper 2
Tuesday, September 22, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్జస్వంత్ రెడ్డి ఆచూకీ కనుగొని, కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యంపై తక్షణ చర్యలు తీసుకోవాలని;;విద్యార్ధి సంఘం నేతలు

జస్వంత్ రెడ్డి ఆచూకీ కనుగొని, కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యంపై తక్షణ చర్యలు తీసుకోవాలని;;విద్యార్ధి సంఘం నేతలు

📰 Generate e-Paper Clip

ప్రజావాణిన్యూస్(మార్చి23)తిరుపతి మల్లంగుంటలో ఉన్న గీతం జూనియర్ కాలేజీలో మొదటి సంవత్సరం (ఇంటర్ ఫస్ట్ ఇయర్) చదువుతున్న జస్వంత్ రెడ్డి అనే విద్యార్థి ఈ నెల 11వ తారీఖున కాలేజీ హాస్టల్ నుండి కనిపించకుండా పోయాడు.ఇంతవరకు ఆ అబ్బాయిని ఆచూకీ కనిపెట్టలేనందున వైయస్సార్ ఎస్ యు, ఎన్ ఎల్ ఎస్ ఏ, ఎన్ ఎస్ యు ఐ, ఓ బి సి విద్యార్థి సంఘం,బి సి యువజన,జి జె ఎస్, విద్యార్థి సంఘ నేతలు. మరియు అబ్బాయి తల్లిదండ్రులు తో కలిసి ఈరోజు జాయింట్ కలెక్టర్ గోవిందరాజులు గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థు సంఘం నేతలు మాట్లాడుతూ సుమారు రెండు వారాలు అయినా ఆ విద్యార్థి ఆచూకీ ఇప్పటివరకు తెలియకపోవడం ఇలాంటి సున్నితమైన,ప్రాణాలకు సంబంధించిన ఘటన జరిగినప్పటికీ,కళాశాల యాజమాన్యం వెంటనే సరైన చర్యలు చేపట్టలేదు.కనిపించకుండా పోయిన విద్యార్థిని కళాశాల యాజమాన్యం కనిపెట్టకుండా మరియు పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ఆలస్యం చేశారు ఘటనను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు.విద్యార్థి తల్లిదండ్రులకు సకాలంలో సమాచారం అందించలేదు.ఈ విధంగా కళాశాల యాజమాన్యం పూర్తి వైఫల్యం చూపించింది. తక్షణమే విద్యార్థి జస్వంత్ రెడ్డి ఆచూకీ త్వరగా కనుగొనేందుకు సంబంధిత పోలీసు, ఇతర అధికారులతో కలిసి తక్షణ చర్యలు చేపట్టాలి. కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి.అలాగే జిల్లా వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలు,హాస్టళ్లలో విద్యార్థుల భద్రత,హాస్టల్ పర్యవేక్షణ, మిస్సింగ్ విద్యార్థులపై తక్షణ సమాచారం ఇవ్వడం వంటి మార్గదర్శకాలు కఠినంగా అమలు అయ్యేలా తగిన ఆదేశాలు జారీ వారన్నారు. విద్యార్థి మరికొద్ది రోజుల్లో కనిపెట్టనియెడల విద్యార్థుల తల్లిదండ్రులతో కళాశాల ముట్టడిస్తామని కూడా హెచ్చరిక జారీ చేశారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ బి ఓబుల్ రెడ్డి,నేషనల్ స్టూడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సుందర్ రాజు,ఎన్ ఎస్ యు వై జిల్లా అధ్యక్షుడు శివ బాలాజీ,జి జె ఎస్ అధ్యక్షుడు మహేంద్ర నాయక్,ఓబీసీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు విజయ్ ఉత్తరాది,బీసీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్ యాదవ్,చంద్రగిరి నియోజకవర్గ అధ్యక్షుడు చెంగల్రెడ్డి,విద్యార్థి విభాగం మండల అధ్యక్షులు యశ్వంత్ రెడ్డి,రఫీ,వినోద్ కుమార్ శేషారెడ్డి భార్గవ్,చంద్రగిరి నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ సెందిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.